చిరంజీవి ‘లూసీఫర్’లో నయనతార: లేడీ సూపర్ స్టార్ నటించేది ఏ పాత్రలోనే తెలుసా?
రీఎంట్రీలో ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒక సినిమా పట్టాలపై ఉండగానే మరో దానిని ప్రకటిస్తూ సత్తా చాటుతోన్న ఆయన.. శరవేగంగా వాటిని మొదలు పెట్టడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్న మెగాస్టార్.. ఇది షూటింగ్ జరుగుతున్న సమయంలోనే 'లూసీఫర్' రీమేక్‌ను కూడా ప్రారంభించేశారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ న్యూస్ లీకైంది.
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసీఫర్' ఒరిజినల్‌లో హీరోయిన్ పాత్రనే ఉండదు. కానీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న రీమేక్‌లో మాత్రం దాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇప్పుడీ పాత్ర కోసమే లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకుంటున్నారని తెలుస్తోంది. వాస్తవానికి గతంలోనే ఈ తరహా వార్త బయటకు వచ్చినా.. అప్పుడు నయన్ ఒప్పుకోలేన్న టాక్ కూడా వినిపించింది. అయితే, ఇప్పుడు మాత్రం చిత్ర యూనిట్ సంప్రదింపులు జరపగా.. దానికి ఈ స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం హీరోయిన్ పాత్రను క్రియేట్ చేసిన దర్శకుడు.. హీరోతో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో అత్యంత కీలకమైన హీరో సోదరి పాత్రలో సీనియర్ హీరోయిన్ సుహాసిని నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, యంగ్ సీఎం రోల్‌ను సత్యదేవ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్వీఆర్ సినిమా బ్యానర్లపై రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











