నయనతార పెళ్ళికి ఆ హీరోను ఎందుకు పిలిచారు? మండిపడుతున్న నెటిజన్లు!
నయనతార అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆమె వివాహం ఎట్టకేలకు జరిగిపోయింది. విఘ్నేష్ తో ఆమె పెళ్లి జూన్ 9న మహాబలిపురంలో పెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో ఘనంగా జరిగింది. వారి పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. పెళ్లి కోసం ముందు నుంచి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అనేక మంది ప్రముఖులు నయనతార, విగ్నేష్ జంటను ఆశీర్వాదించారు. అయితే ఒక హీరో హాజరైన విషయంలో మాత్రం పెద్ద ఎత్తున వివాదం రేగింది. ఆ వివరాలు..

నయనతారకు ముద్దు పెడుతూ
ముందు నుంచి తమ పెళ్లికి గ్రాండ్ గా ఏర్పాటు చేసుకున్న నయన్, విఘ్నేష్ అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. అయితే ముందు నుంచి వీరి పెళ్లిని సీక్రెట్ గా ఉంచాలనుకున్నారు. అందుకు అనుగుణంగా సోషల్ మీడియా ద్వారా విఘ్నేష్ పెళ్లికి సంబంధించిన మెుదటి ఫొటోను షేర్ చేశారు. అందులో నయనతారకు ముద్దు పెడుతూ.. తన ప్రేమను చాటుకున్నారు విఘ్నేష్.

పెళ్లి వేడుకలో
ఇక నయనతార, విఘ్నేష్‌శివన్ పెళ్లి వేడుకకు తమిళ సినీ ప్రముఖులందరూ కనిపించారు. మరీ ముఖ్యంగా వీరి పెళ్లికి బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్‌ఖాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దర్శకుడు అట్లీ కుటుంబంతో కలిసి షారుఖ్‌ఖాన్ పెళ్లికి హాజరయ్యారు. అట్లీ ఫ్యామిలీతో షారుఖ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఇక కోలీవుడ్ అగ్ర హీరో రజనీకాంత్, కార్తి, విజయ్ సేతుపతి, ఎస్ జే సూర్య, మణిరత్నం, కె.ఎస్.రవికుమార్, ఉధయనిధి స్టాలిన్ తో పాటు పలువురు ప్రముఖులు పెళ్లి వేడుకలో దర్శనమిచ్చారు.

హీరో విషయంలో
ఇక వీరి వివాహం జరిగిన వెంటనే కొత్త దంపతులు.. తమిళనాడు వ్యాప్తంగా.. లక్ష మంది అనాథలకు అన్నదానం చేసి మంచి మనసు చాటుకున్నారు. దీంతో వారు చేసింది చాలా గొప్ప విషయమని ఆమె ఫ్యాన్స్ ఆమె మీద పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇదంతా ఇలా ఉంటె ఆమె వివాహానికి హాజరైన ఒక హీరో విషయంలో ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

లైంగిక వేధింపులకు
ఆ హీరో మరెవరో కాదు మలయాళ వివాదాస్పద హీరో దిలీప్ కుమార్. గతంలో నటి భావన లైంగిక వేధింపుల వ్యవహారంలో దిలీప్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఒకప్పుడు మంజు వారియర్ భర్త అయిన దిలీప్ మరో నటితో వివాహం సంబంధం పెట్టుకున్నాడనే విషయం భావన ఆమెకు వరకు తీసుకు వెళ్ళింది.. ఈ క్రమంలోనే సదరు నటితో కలిసి ఆమె తమ్ముడి సహాయంతో భావన మీద దిలీప్ అండ్ కో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

అందరినీ పిలిచినట్టు
ఈ విషయం హాట్ టాపిక్ గా మారడంతో పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురిసింది. దీంతో దిలీప్ అరెస్టయి జైలుకు కూడా వెళ్లిన నేపథ్యంలో మలయాళ సినీ నటులు సంఘం నుంచి వెలి వేశారు. తర్వాత దిలీప్ ను మళ్ళీ సంఘంలోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం మీద నయనతార మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తిని ఎలా పెళ్ళికి పిలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. అయితే నయనతార తప్పేమీ లేదని గతంలో ఆయనతో కలిసి కొన్ని సినిమాలు చేసిన నేపథ్యంలోనే అందరినీ పిలిచినట్టు ఆయనను కూడా పిలిచిందని ఆమె అభిమానులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











