సిద్ధమ్మగా నయనతార: ‘సైరా’ న్యూ మోషన్ పోస్టర్ అదుర్స్
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.... ఉయ్యాలవాడ భార్య పాత్రను నయనతార పోషిస్తోంది.
తాజాగా నయనతార పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె 'సిద్ధమ్మ' పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి-నయనతార మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులకు కనువిందు చేసేలా ఉంటలాయని చిత్ర బృందం తెలిపింది.
నయనతారకు సంబంధించిన కొన్ని ఇటీవల షెడ్యూల్‌లో చిత్రీకరించారు. నయనతారకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో ఈ షెడ్యూల్‌లో కేవలం 3 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చిందట. దీంతో సురేందర్ రెడ్డి అండ్ టీమ్ మూడు రోజుల్లో ఆమె సీన్లు పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డారని తెలుస్తోంది.
కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. 2019 సమ్మర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తెలుగులో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇదే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ సైతం ఇందులో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











