నయనతారను వెంటాడుతున్న చిక్కులు.. కోర్టు కేసుల వరకూ వెళ్లింది

సౌత్ సినిమాల్లో కెరీర్ పరంగా మహారాణిలా కొనసాగుతున్న నయనతారకు కొత్త చిక్కు వచ్చింది. ఆమె నటించిన తాజా సినిమా 'కోలైయుతీర్ కలాం' సినిమా వ్యవహారం కోర్టు వరకూ వెళ్లడంతో డిసప్పాయింట్ అయింది నయనతార. చక్రి తోలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కింది. అయితే ఆ నవల హక్కులను తానే తీసుకున్నానని పేర్కొంటూ మరో దర్శకుడు కోర్టులో కేసు వేయడం కోలీవుడ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు

వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార సౌత్ సినీ ఇండస్ట్రీలోని అందరూ అగ్ర హీరోలతో కలిసి నటించింది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె మనసు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై పడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఐరా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈమె ప్రస్తుతం 'కోలైయుతీర్ కలాం' సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది.

కోలైయుతీర్ కలాం మూవీ

బిల్లా 2 ఫేం చక్రి తోలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా కోలైయుతీర్ కలాం. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ భూమిక కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంది. కాగా తమిళ రచయిత సుజాతా రంగరాజన్‌ నవల ఆధారంగా కోలైయుతీర్ కలాం సినిమా తీసినట్లు తెలిసింది.

ఇంతలో అనుకోని చిక్కులు

ఇంతలో అనుకోని చిక్కులు

ఈ సినిమాను జూన్‌ 14న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇంతలో అనుకోని చిక్కుల్లో పడిన ఈ సినిమా చివరకు కోర్టు దాకా వెళ్లింది. సుజాతా రంగరాజన్‌ నవల హక్కుల్ని 10 లక్షల రూపాయలకు సుజాతా రంగరాజన్‌ భార్య నుంచి కొనుగోలు చేశానని దర్శకుడు బాలాజీ కుమార్‌ ఆరోపణ తీసుకొచ్చాడు. ఇది కాపీ రైట్స్‌ను ఉల్లంఘించడమని పేర్కొంటూ.. ఈ సినిమా విడుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశాడు.

వివరణ కోరిన కోర్టు

వివరణ కోరిన కోర్టు

బాలాజీ కుమార్‌ ఆరోపణను పరిశీలించిన కోర్టు 'కోలైయుతీర్ కలాం' సినిమా విడుదల ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ నెల 21న చిత్ర నిర్మాతలు దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కెరీర్ షైనింగ్ లో దూసుకుపోతున్న తరుణంలో నయనతారకు వస్తున్న చిక్కులు సినీ సర్కిల్స్ లో హాట్ అవుతున్నాయి. గతంలో ఈమెపై రాధారవి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించగా.. ఇప్పుడు కోలైయుతీర్ కలాం మూవీ నయన్‌కి కాస్త ఇబ్బంది కలిగిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X