భర్తతో విడాకులు... అసలేం జరిగిందో చెబుతూ నయనతార ఎమోషనల్​ వీడియో పోస్ట్! ​

తన భార్య, హీరోయిన్ నయనతారతో విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై దర్శకుడు విఘ్నేశ్ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన పెట్టిన కాసేపటికే నయన్​ కూడా అదే ఎమోషన్ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడంతా దాని గురించే చర్చ సాగుతోంది. పూర్తి వివరాలు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

సోషల్ మీడియాలో పెద్ద రచ్చే :సెలబ్రిటీల పర్సనల్ వార్తలు అంటే చాలా మంది సామాన్య ప్రజలకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఎవరెవరు రిలేషన్​షిప్స్​ మెయిన్​టెయిన్ చేస్తున్నారు? ఎవరెవరు పెళ్లి చేసుకోబోతున్నారు? ఎవరెవరు విడిపోతున్నారు? అనే దానిపై మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక సౌత్ ఫిల్మ్ సెలబ్రిటీల్లో స్టార్ హీరోయిన్​గా కొనసాగుతున్న నయనతార అంటే ఎంతో మందికి ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఆమెకు సంబంధించిన వార్తలైతే ఇట్టే వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఇద్దరు కవల పిల్లలు, భర్తతో సంతోషంగా సాగుతున్న ఆమె పర్సనల్​ లైఫ్​కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే సాగుతోంది.

Nayanthara Shared an emotional video post on divorce with Her Husband Vignesh Shivan News Goes Viral

డివొర్స్​​ హింట్:ఎక్కడ చూసినా నయనతార విడాకులు, నయనతార విడాకుల అన్న చర్చే జరుగుతోంది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. రీసెంట్​గా నయన్ తన భర్త, దర్శకుడు విఘ్నేస్​ను అన్​ఫాలో చేయడమే ఈ నెట్టింట గోలకు కారణం. మరి నిజంగానే నయన్​ అన్​ ఫాలో చేసిందా?, సాంకేతిక సమస్య వల్ల అది జరిగిందా క్లారిటీ అవ్వలేదు. అంతలోనే మళ్లీ నయన్​ తన భర్తను ఫాలో చేసేసింది. ఏం జరిగిందో పక్కనపెడితే ఈ మధ్య సెలబ్రిటీలు సమంతతో మొదలై నిహారిక వరకు అందరూ డివొర్స్​​ హింట్​ను అన్​ఫాలోతోనే ఇస్తున్నారు.

పుకార్లకు చెక్ :అందుకే నయనతార కూడా అలానే చేసిందని అంతా భావించారు. అయితే తాజాగా దీనిపై నయన్ భర్త విఘ్నేశ్​ స్పందించారు. డైరెక్ట్​గా మాట్లాడలేదు కానీ ఒక త్రో బ్యాక్ ఎమోషనల్​ వీడియో పోస్ట్ట్​తో చెక్​ పెట్టారు. ఆ వీడియో గతేడాది తమ పెళ్లి రోజు తీసుకున్నారని తెలుస్తోంది. దానినే మళ్లీ షేర్ చేసి డివొర్స్​పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లు అర్థమవుతోంది. ఇందులో ఓ వ్యక్తి ఫ్లూట్ వాయిస్తూ కనిపించారు. ఆయన పక్కన నయన్- విఘ్నేష్ కూర్చొని మ్యూజిక్ వింటున్నారు. ఈ క్రమంలోనే నయన్ భర్తను పట్టుకుని ముద్దులు పెడుతూ ఎమోషనల్ అవ్వడం కనపడుతుంది. ఇక ఇదే వీడియోను నయనతార కూడా పోస్ట్ చేసింది. అంటే ఈ వీడియో ద్వారా తామిద్దరి బంధం బలంగానే మీరే అనవసరపు ప్రచరాం చేస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారని చెప్పకనే చెప్పారు ఈ జంట.

Nayanthara Shared an emotional video post on divorce with Her Husband Vignesh Shivan News Goes Viral

ఇక నయనతార సినిమాల విషయానికొస్తే..:గతేడాది బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్​ జవాన్ చిత్రంలో హీరోయిన్​గా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది నయనతార. ఇందులో పోలీస్ ఆఫీసర్​గా కనిపించి మెప్పించింది. ఆ తర్వాత తన 75వ చిత్రంగా అన్నపూరని అనే ఓ సినిమా చేసింది కానీ అది బాగా విమర్శలకు దారీ తీసింది. దాన్ని ఓటీటీ నుంచి తొలిగించేశారు. ప్రస్తుతం తన కొత్త చిత్రాలపై దృష్టి పెడుతోంది నయన్. ఆమె చేతిలో క్రికెట్​ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కుతున్న టెస్ట్​, మన్నగట్టి సిన్స్ 1960 చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X