విడాకుల వైపు నజ్రియా - ఫహద్ ఫాజిల్.. అసలు కారణం ఏంటీ?

నజ్రియా నజీమ్.. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన హీరోయిన్ ఈమె. 'రాజా రాణి' చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. నేచురల్ స్టార్ నాని సరసన 'అంటే.. సుందరానికీ' చిత్రంలో నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'సూక్ష్మదర్శిని' అనే చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో విడుదలైన ఈ మిస్టరీ ఫిల్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ సంచలనంగా మారింది. ఇలా కెరీయర్ పరంగా ఈ ముద్దుగుమ్మ దుమ్ములేపుతోంది. కానీ తాజాగా మాత్రం తన వ్యక్తిగత విషయంతో దక్షిణాది సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గ్గా మారింది.

ఇక మరోవైపు మలయాళ అగ్ర హీరో ఫహద్ ఫాజిల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ను డైరెక్ట్ గా పలకరించిన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రంలో షికావత్ సార్ పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎంతో దగ్గరయ్యారు. ఇలా తెలుగు ప్రేక్షకులకు ఈ స్టార్ కపుల్ చాలా దగ్గరయ్యారు. సినిమా సినిమాకు వారిని ప్రేమించే వారి సంఖ్య తెలుగు స్టేట్స్ లో పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. ఇక వీరి గురించి తమ అభిమానులనే కాకుండా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీనే ఉలిక్కి పడే వార్త ప్రచారంలో ఉంది.

Nazriya Nazim Fahadh Faasil Divorce

ఈ స్టార్ కపుల్ ప్రస్తుతం డివోర్స్ తీసుకోవడానికి సిద్ధమయ్యారని ఆ వార్త సారాంశం. కొన్నాళ్లుగా హీరోయిన్ నజ్రీయా నజీమ్ తన భర్తతో కలిసి ఎక్కడా కనిపించకపోవడం.. కనీసం రీసెంట్ గా విడుదలైన తన 'సూక్ష్మ దర్శిని' చిత్ర ప్రమోషన్స్ లోనూ కనిపించకపోవడం, తాజాగా సుదీర్ఘమైన నోట్ విడుదల చేయడంతో విడాకుల వార్తలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. అయితే నజ్రీయా తాజాగా విడుదల చేసిన నోట్ లో మాత్రం తనకు పలు వ్యక్తిగత సమస్యలతో బయటికి రావడం లేదని చెప్పుకొచ్చారు. కనీసం బర్త్ డే కూడా చేసుకోలేకపోయాయని చెప్పుకొచ్చింది. పైగా తన స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు టచ్ లో లేకుండా ఉన్నందుకు క్షమించాలని కోరింది.

త్వరలోనే అందరి ముందుకు వస్తానని చెప్పింది. ఆ తర్వాత మీకే అన్ని విషయాలు మీకు తెలుస్తుందని చెప్పడంతో డివోర్స్ రూమర్లు మరింత జోరుగా సాగాయి. అయితే తాజాగా వీరిద్దరి డివోర్స్ కు పలు కారణాలున్నాయని తెలుస్తోంది. నజ్రియా కు పలు హీరోలతో ఎఫైర్లు ఉన్నాయని, పైగా తనకు సినిమాలు చేయొద్దని కండీషన్స్ పెట్టడం పలు కారణాలుగా తమిళ, మలయాళ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు నజ్రియా నజీమ్ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ను 2014లో పెళ్లి చేసుకుంది. నేటికి 11 ఏళ్లు గడిచింది.

అయితే 11 ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఎలాంటి సంతానం లేకపోవడం ఒక కారణమని అంటున్నారు. మరోవైపు 42 ఏళ్లు వచ్చిన ఫహద్ ఫాజిల్ 30 ఏళ్లు ఉన్న నజ్రియా మధ్య ఏజ్ గ్యాప్ తో వచ్చే అభిప్రాయ బేధాలని కూడా అంటున్నారు. ముఖ్యంగా సినిమాలు చేయొద్దని, త్వరగా పిల్లలని కనాలని ఫహాద్ ఫాజిల్ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరగడం కూడా ఒక కారణమని మలయాళ మీడియా, సోషల్ మీడయాలో వినిపిస్తోంది. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఇక మున్ముందు నజ్రీయా, ఫహద్ ఎలా స్పందిస్తారా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X