నానితో మలయాళీ భామ రొమాన్స్.. భర్తతో కలిసి హైదరాబాద్‌కు! స్వాగతం పలికిన మైత్రీ
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అంటే సుందరానికి చిత్ర షూటింగు జోరుగా మొదలైంది. ఈ ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తున్న నాజ్రియా నాజిమ్ ఏప్రిల్ 19వ తేదీన షూటింగుకు హాజరయ్యారు. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి తన భర్త ఫహద్ ఫాజిల్‌తో కలిసి హైదరాబాద్ చేరుకొన్నారు. ఈ విషయాన్ని నాజ్రియా తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా పంచుకొన్నారు.
నాభి అందాలను ప్రదర్శిస్తున్న శ్రీజా ఘోష్.. వయ్యారాలను ఒలకబోస్తూ షోటోషూట్
అంటే సుందరానికి చిత్రంలో లీలా పాత్రలో నటిస్తున్న నాజ్రియా ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. అందరికీ నమస్కారం.. ఈ రోజు నేను నా తొలి తెలుగు మూవీ షూటింగులో పాల్గొంటున్నాను. తొలి అనేది ఎవరికైనా ఎక్సైటింగ్.. అంటే సుందరానికి నాకు ప్రత్యేకమైనది అంటూ నాజ్రియా తన పోస్టులో పేర్కొన్నారు.

అంటే సుందరానికి షూటింగుకు హాజరైన నాజ్రియాను మైత్రీ మూవీస్ స్వాగతించారు. ఇన్స్‌టాగ్రామ్‌లో మైత్రీ మూవీస్ స్పందిస్తూ.. నాజ్రియా ఫహద్‌కు అంటే సుందరానికి టీమ్ స్వాగతం పలుకుతున్నది. ఈ మూవీ నిజంగా స్పెషల్ అంటూ వారు పోస్టులో పేర్కొన్నారు.రొమాంటిక్, కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఫహద్ ఫాజిల్ ఇప్పటికే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రంలో ప్రధాన విలన్‌గా కనిపించబోతున్నారు. అలా ఫాహద్, నాజ్రియా దంపతులు టాలీవుడ్‌లోకి ఒకేసారి ఎంట్రీ ఇవ్వడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











