సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన బాలయ్య... 105 మొదలైంది!
'ఎన్టీఆర్ బయోపిక్' తర్వాత బాలయ్య చేయబోయే చిత్రం ఏది? అనే విషయంలో కొన్ని రోజులుగా అయోమయ పరిస్థితి నెలకొన్ని సంగతి తెలిసిందే. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య మూవీ ప్రారంభం కావాల్సి ఉండగా ఆగిపోయినట్లు రూమర్స్ హల్ చల్ చేశాయి. ఆ పుకార్లకు తెర దించుతూ ఆయన 105వ చిత్రం గురువారం ప్రారంభం అయింది.
సి కళ్యాణ్ నిర్మాతగా హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా రూపొందుతున్న ఈ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహూర్త సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రానికి కాస్టింగ్ పూర్తికాలేదు. బాలయ్య సరసన నటించే హీరోయిన్ ఎవరు? ఇతర ముఖ్య తారాగణం, టెర్నీషియన్ల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.చిరంతన్ భట్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి విడుదల లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
ప్రముఖ తమిళ దర్శకుడైన కెఎస్ రవికుమార్ గతేడాది బాలయ్య హీరోగా 'జైసింహ' అనే సినిమా చేయగా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు పని చేసిన దర్శక నిర్మాతలతోనే ఇపుడు బాలయ్య మరో సినిమా మొదలు పెట్టారు.

మరో వైపు బాలయ్యతో సినిమా చేసేందుకు ప్రముఖ దర్శకుడు బోయపాటి కూడా లైన్లో ఉన్నారు. అయితే బోయపాటి ప్రస్తుతం నిర్మాత కోసం వెతుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో తాను చేయాలనుకున్న కథకు భారీ బడ్జెట్ అవసరం ఉండటంతో అందుకు తగిన నిర్మాత కోసం ఆయన అన్వేషిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











