బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్: బోయపాటితో మొదలెట్టిన నందమూరి నటసింహం

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్‌లో కొత్త సినిమా రానుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మధ్య మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు కూడా విన్నాం. కానీ ఎట్టకేలకు నేడు (డిసెంబర్ 6) ఈ సినిమాను ప్రారంభించారు. బోయపాటి శ్రీను- బాలకృష్ణ సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు.

దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమను ఉర్రూతలూగిస్తున్న బాలయ్య బాబు.. ప్రస్తుతం తన 105 సినిమా 'రూలర్' సినిమాతో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా విడుదల కాగానే బోయపాటి సినిమా రెగ్యులర్ షూట్‌లో పాల్గొననున్నారు బాలకృష్ణ.

NBK 106 Starts In Boyapati Srinu Direction

బాలకృష్ణ- బోయపాటి కాంబోకి సంబంధించిన వివరాలు నందమూరి అభిమాన వర్గాల్లో ఇప్పటినుంచే ఆతృతను పెంచేస్తున్నాయి. ''సింహా, లెజెండ్'' వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో 106వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ''నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం'' అనే డైలాగ్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు అతిత్వరలో వెల్లడించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X