NBK107: అఖండ రికార్డును చేరని బాలయ్య.. టాప్ 10లోనూ దక్కని చోటు
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో నందమూరి హీరో నటసింహా బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న ఆయన.. ఇప్పటికే వందకు పైగా చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అందులో చాలా వరకూ ఇండస్ట్రీ హిట్లు ఉన్నా.. కొంత కాలం పాటు బాలయ్య వరుస పరాజయాలతో సతమతం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ఆయన 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ రికార్డులు నమోదు చేసుకుంది.
'అఖండ' వంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ.. 'క్రాక్' సినిమాతో సక్సెస్‌ను అందుకున్న గోపీచంద్ మలినేనితో సినిమాను ప్రకటించారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీనికోసం గోపీచంద్ లైబ్రెరీలలో ఉన్న పాత సంఘటనలను కూడా ఆధారంగా తీసుకున్నాడు. ఇది ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాను అనుకున్న సమయానికి మొదలు పెట్టలేకపోయారు. ఇక, ఫిబ్రవరి నుంచే ఈ సినిమా రెగ్యూలర్ షూట్ మొదలైంది. అలాగే ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితమే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో బాలయ్య తెల్ల పంచె, నలుపు రంగు షర్ట్‌తో పవర్‌ఫుల్ గెటప్‌తో కనిపించారు. ఫలితంగా ఇది పక్కా మాస్ మసాలా సినిమా అని అర్థం అయింది. ఈ క్రమంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ జూన్ 10న పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని పురస్కరించుకుని జూన్ 9న సాయంత్రం 6:11 గంటలకు గోపీచంద్ మలినేని తెరకెక్కించే ఈ సినిమా నుంచి NBK107 First Hunt పేరుతో టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ వీడియోకు భారీ స్పందన దక్కింది.
నటసింహా నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌కు 24 గంటల్లో 7.28 మిలియన్ వ్యూస్ దక్కాయి. అలాగే, 305.5K లైకులు కూడా దక్కాయి. దీంతో ఒకరోజులో ఎక్కువ వ్యూస్, లైకులు సాధించిన చిత్రాల జాబితాలో ఇది టాప్ 20లో చోటు దక్కించుకుంది. వ్యూస్ పరంగా చూస్తే ఈ మూవీ టీజర్ 16వ స్థానంలో ఉంది. దీనికంటే ముందు 'అఖండ' మూవీ టీజర్ ఉంది. అలాగే, లైకుల పరంగానూ NBK107 First Hunt 16వ స్థానంలోనే నిలిచింది. ఇందులో 'అఖండ' ఏకంగా 28వ స్థానంలో ఉండడం గమనార్హం.
భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











