twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెట్‌ఫ్లిక్స్‌‌లో ప్రదర్శన ఆపేయండి... బాంబే బేగమ్స్‌కు ఝలక్

    |

    ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న బాంబే బేగమ్స్‌ ప్రదర్శనను ఆపివేయాలని బాలల హక్కులను పరిరక్షించే సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

    చిన్న పిల్లల చేత డ్రగ్స్ వినియోగించే సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదుల రావడంతో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ తీవ్రంగా స్పందించింది. 24 గంటల్లోగా వెంటనే నివేదిక సమర్పించాలని నెట్‌ఫ్లిక్స్ ఆదేశాలు జారీ చేసింది. మైనర్ బాలలు కొకైన్ తీసుకోవడంపై ట్వీట్లు చేస్తూ వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొన్నది.

    ఇలాంటి అభ్యంతరకరమైన, ప్రమాదకరమైన కంటెంట్ చిన్న పిల్లల ఆలోచనలను పొల్యూట్ చేస్తుంది. బాలల పెడదోవన పట్టే అవకాశం, ప్రమాదం ఉంది అని ఎన్‌సీపీసీఆర్ పేర్కొన్నది.

    NCPCR directs to Netflix to stop streaming of Bombay Begums

    ముంబైలోని సంపన్న వర్గాలకు చెందిన ఐదుగురు మహిళలకు సంబంధించిన జీవిత కథగా బాంబే బేగమ్స్ రూపొందింది. ఆధునిక భావాలున్న మహిళల జీవన విధానాన్ని తెరకెక్కించారు.

    ఇప్పటికే ది సూటబుల్ బాయ్, తాండవ్ లాంటి వెబ్ సిరీస్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుతం బాంబే బేగమ్స్‌పై ఫిర్యాదులు రావడంతో మరోసారి వెబ్ సిరీస్‌లపై సెన్సార్ విధించాలన్న వాదనకు డిమాండ్ పెరుగుతున్నది.

    English summary
    Bombay Begums web series is streaming on Netflix from quiet sometime. But Indian government agency for protecting child rights NCPCR serious over content of Bombay Begums. NCPCR asked to Netflix to stop this web series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X