రొమాంటిక్‌గా నీ జతగా.. సరికొత్త ప్రేమ కథా చిత్రంగా.. టీజర్‌కు ఫుల్ రెస్పాన్స్ అంటూ..
శ్రీ సుభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై భమిడిపాటి వీర దర్శకత్వంలో రామ్ బి నిర్మిస్తున్న సినిమా చిత్రం నీ జతగా సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజై మంచి రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. ఈ చిత్రంలో యువ తారలు భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్, బాలరాజు పులుసు, సునీల్ రాజ్,దీపక్ దగని, దీపు సల్ల ,మెహబూబ్ భాషా, లిపికా, భాషా తదితరలు నటించారు. ఈ సందర్భంగా టీజర్ గురించి చిత్ర యూనిట్ మాట్లాడుతూ..

డైరెక్టర్ భమిడిపాటి వీర మాట్లాడుతూ* మా టీజర్‌కు మంచి స్పందన లభిచింది, మా చిత్రంలో అనంత్ శ్రీరామ్ పాటలు రాయడం ఇక విశేషమైతే.. అందులో ఒక పాటను రిలీజ్ చేసినందుకు అనంత్ శ్రీరామ్ ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాం అలాగే సింగర్ అనురాగ్ కులకర్ణికి థ్యాంక్స్ చెప్పుకొంటున్నాం అని అన్నారు.
నిర్మాత రామ్ బీ మాట్లాడుతూ... మా సినిమా టీజర్‌కు, అనంత్ శ్రీరామ్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది, త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. మా సినిమాను డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే చూశారు. మా మీద చాలా నమ్మకంతో ఉన్నారు. అది మాకు సానుకూలంగా మారడమే కాకుండా మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది అని అన్నారు.
గేయ రచయిత అనంత్ శ్రీ రామ్ మాట్లాడుతూ.. ప్రయాణం, జీవితం ఒకే చోట మొదలైనప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్న నేపథ్యంలో పాట మొదలవుతుంది. ఈ పాటలో పకృతి గురించి చాలా ఆహ్లాదకరమయిన పదాలు జోడించి రాయడం జరిగింది అని పాట గురించిన విశేషాన్ని వివరించారు.

నటీనటులు: భరత్ బండారు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, సాయిరాం బి.ఏస్, రఘు వీరాచారి, నయని పావని, ప్రవణ్, బాలరాజు పులుసు, సునీల్ రాజ్, దీపక్ దగని, దీపు సల్ల ,మెహబూబ్ భాషా, లిపికా, బాషా తదితరులు
డైరెక్టర్: భమిడిపాటి వీర
నిర్మాత: రామ్ బి
లిరిక్స్: అనంత్ శ్రీరామ్
మ్యూజిక్: పవన్
సింగర్: అనురాగ్ కులకర్ణి
డివోపీ: కేవీ శ్రీధర్
ఎడిటర్: ప్రభు
పీఆర్‌వో: మధు వి.ఆర్
బ్యానర్ :శ్రీ సుభద్ర క్రియేషన్స్


Click it and Unblock the Notifications











