సినిమా బాగాలేదంటే డబ్బులు వాపస్.. ‘నీ కోసం’ హీరో సెన్సేషనల్ కామెంట్స్

తెలుగు ప్రేక్షకులకు అందమైన ప్రేమకథ అందించేందుకు వస్తున్న చిత్రం నీకోసం. నిజ జీవితం లో చూసిన విన్నసంఘటనల నుండి పుట్టిన కథే నీ కోసం. అందరూ కొత్త వల్లే అయినా కొత్తదనం నిండిన కథ తో ఎంటర్టైన్ చేసేందుకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ ఐన పాటలు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి . ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో చిత్ర యూనిట్ మాట్లాడుతూ ....

మ్యూజిక్ దర్శకుడు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ... పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సంఘటన ఈ సినిమా లో ఏదో సీన్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా రీరికార్డింగ్‌లో ఒక మంచి సినిమాకు పనిచేసాను అనే సంతృప్తి కలిగింది టీం అందరూ బాగా చేసారు.". అన్నారు.

Neekosam movie cute love story: Ajith Radharam

హీరో అరవింద్ రెడ్డి మాట్లాడుతూ .. 'అందరం కొత్తవాళ్లమే. ఈ సినిమా ఎందుకు చూడాలి అనే వారికి నేను ఇచ్చే భరోసా ఒక్కటే ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ దగ్గర నా మొబైల్ నెంబర్ కౌంటర్‌లో ఇస్తాను చూసి ఈ సినిమా బాగోలేదు అంటే నేను వాళ్ళ డబ్బులు వెనక్కి ఇస్తాను. ఈ సినిమా నా ఫ్యామిలీ సపోర్ట్‌తో చేశాను. నా సోదరి నాకు అండగా నిలబడింది. దర్శకుడు నా స్నేహితుడు. ఒక ఆడియన్‌గా సినిమాలు చూసే నేను ఇప్పుడు నా కుటుంబం ఇచ్చిన సపోర్ట్ తో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నించాను . సినిమా కథ అనుకున్నప్పటి నుంచి ఫస్ట్ కాపీ చూసే వరకూ కూడా అంతే నమ్మకంతో పని చేసాము. అనుకున్న దాని కంటే బాగా కథను తెరమీద చూపాడు దర్శకుడు. ఒక మంచి ప్రేమకథ చూసిన ఫీల్ తప్పకుండా ప్రేక్షకులు ఫీల్ అవుతారు " అన్నారు .
Neekosam movie cute love story: Ajith Radharam

మరో హీరో అజిత్ రాధారామ్ మాట్లాడుతూ... ''నేను ఇక్కడ ఉన్నానంటే కారణం నన్ను సపోర్ట్ చేసిన మా నాన్నగారు, నాకు నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్‌గారు, నా మీద నమ్మకంతో ప్రోత్సహించిన దర్శకుడు . స్టోరీకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా యూత్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యే కథ. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. నా పాత్ర ఒక సిన్సియర్ లవర్ గా ఉంటుంది. ఈ పాత్ర మీకు నిజ జీవితం లో చూసిన పాత్రలా ఉంటుంది . తప్పకుండా ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారనే నమ్మకం ఉంది " అన్నారు.

హీరోయిన్ సుభాంగి పంత్ మాట్లాడుతూ ... "ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా చూడాల్సిన సినిమా . లవ్ లోని భావోద్వేగాలు చాలా బాగా కన్సెక్ట్ అవుతాయి.
ఈ టీమ్ తో పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. నా క్యారెక్టర్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు లైఫ్ స్టోరీ కూడా , ఈ సినిమా ప్రేక్షకులతో చూసేందు నేను ఎదురు చూస్తున్నాను " అన్నారు.

మరో హీరోయిన్ దీక్షితా పార్వతి మాట్లాడుతూ... " నేను ముందుగా మా అమ్మకు థాంక్స్ చెప్పాలి. నా ఇష్టాన్ని గౌరవించి ప్రోత్సహం అందించారు. ఒక బెస్ట్ టీంతో పనిచేసాను అనే ఫీల్ నాకు ఉంది. ఈ సినిమా లో పాటలు మీకు చాలా కాలం గుర్తుంటాయి. ఈ సినిమాలో మేం చేసిన ప్రతి క్యారెక్టర్ మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. టీజర్, ట్రైలర్ చూసినప్పుడు మీకు మంచి ఫీలింగ్ వచ్చి ఉంటుంది. కానీ సినిమా చూసిన తర్వాత మీకు ఈ సినిమాతో ఓ ఎమోషనల్ బాండింగ్ కూడా ఏర్పడుతుంది. సినిమా కోసం చాలామంది కష్టపడ్డాం. మా దర్శకుడు చాలా ప్యాషన్ తో సినిమా చేశారు.. మాకు మీ అందరి ఆశిష్షులు కావాలి..' అని అన్నారు.

దర్శకుడు అవినాష్ కోకటి మాట్లాడుతూ ... "
మనిషి పోయాక చాలా ప్రేమను చూపెడుతారు. కానీ ఉన్నప్పుడే ఆ ప్రేమని పంచుకుంటే జీవితం చాలా బాగుండేది. అదే నీ కోసం సినిమాలో చెప్పే ప్రయత్నం చేసాము. ఈ సినిమాలో ప్రేమ కథలు చాలా కాలం మీ తో ట్రావెల్ చేస్తాయి. మ్యూజిక్ దర్శకుడు అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ఒక పెద్ద స్టార్ హీరోకి ఇచ్చే ఆల్బం మాకు ఇచ్చాడు . ఈ సినిమా లో పాత్రలు మీకు తెలుసు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. మీరు మర్చిపోయిన.. లేదా వదిలేసిన రిలేషన్స్ అన్నీ మీకు మళ్లీ గుర్తొస్తాయి. ఇది కేవలం యూత్ కోసం మాత్రమే కాదు.. ఒక ఎమోషనల్ డ్రైవ్ లాంటి సినిమా.. ' అని అన్నారు.

రాజలింగం సమర్పణలో తెరకెక్కిన ఈ మూవీలో అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
బ్యానర్: తీర్ధ సాయి ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్: అల్లూరమ్మ (భారతి)
సినిమాటోగ్రఫీ: శివక్రిష్ణ యెడుల పురమ్
ఎడిటింగ్ : తమ్మిరాజు
ఆర్ట్: క్రాంతి ప్రియ
రచన, దర్శకత్వం : అవినాష్ కోకటి.

Read more about: ajith radharam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X