‘ఆచార్య’లో ఆ సాంగ్ కూడా అదుర్స్: స్పెషల్ అట్రాక్షన్‌గా చరణ్ డ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం 'ఆచార్య'. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. చిత్రీకరణకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో ఇది ఇంకా పూర్తి కాలేదు. ఇక, కొద్ది రోజుల్లో టాకీ పార్ట్ పూర్తవుతుంది అనుకున్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా మళ్లీ ఆగిపోయింది. దీంతో సినిమా విడుదల వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది.
'ఆచార్య' మూవీ నుంచి ఇప్పటికే 'లాహె లాహె' అనే ఓ సాంగ్ విడుదలైంది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సాఫ్ట్ మెలోడీ సాంగ్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే పాట విడుదల కాబోతుందట. ఇది రామ్ చరణ్ - పూజా హెగ్డే కాంబినేషన్‌లో రూపొందిన 'నీలాంబరి' అనే సాంగ్ అని సమాచారం. ఫాస్ట్ బీట్‌తో రెడీ అయిన ఇందులో మెగా పవర్ స్టార్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ సాంగ్‌తో మెగా అభిమానులకు ఫుల్ మీల్స్ గ్యారెంటీ అన్న టాక్ బాగా వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆచార్య' మూవీలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటకు విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక, ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే, రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే చేస్తోంది.


Click it and Unblock the Notifications











