ముందే లీకైన ఆచార్య మూవీ సర్‌ప్రైజ్: చిరంజీవి నుంచి నెక్ట్స్ వచ్చేది అదేనట

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం 'ఆచార్య'. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. దీని కోసం భారీ ఖర్చుతో టెంపుల్ టౌన్ అనే సెట్‌ను కూడా వేశారు. ఇక, ఈ మధ్యనే ముఖ్యమైన షెడ్యూల్ ప్రారంభమైనా.. కరోనా ప్రభావంతో అది కాస్తా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో 'ఆచార్య' మూవీ నుంచి ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

యువ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్.. లేత సొగసులను అలా దాచేస్తూ..

'ఆచార్య' సినిమా నుంచి ఇప్పటికే టీజర్‌తో పాటు ఓ మెలోడీ సాంగ్ కూడా విడుదలైంది. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే త్వరలో ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేయాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఇది రామ్ చరణ్ - పూజా హెగ్డే మధ్య సాగే 'నీలాంబరీ' అనే సాంగ్ అని విస్వసనీయంగా తెలిసింది. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ టచ్ కనిపిస్తుందని.. ఇది సినిమాకే హైలైట్‌గా నిలిచే పాట అవుతుందని అంటున్నారు. దీంతో ఈ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.

Neelambari Song will Release from Acharya

భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న 'ఆచార్య' మూవీలో చిరంజీవి, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే, రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X