సినిమా కోసం కొట్టేసుకుంటోన్న హీరో – డైరైక్టర్

థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను రెండు గంటల పాటూ ఓ సినిమా కథలో మమేకం చేయడం మామూలు విషయం కాదు. అయితే ఈ మధ్య అలా వచ్చిన వారు పాప్ కార్న్ తింటూ ఆ కాసేపూ ఎలా గడుస్తుందా అని ఎదురూ చూస్తున్నట్లే ఉంది వ్యవహారం. నిజం చెప్పాలి అంటే ఓ మాంచి కాఫీ లాంటి సినిమా కోసం జనాలు వేయి కళ్లతో ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు 'నీతో' మూవీ కావాల్సిన అన్ని హంగులు సంతరించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. అయితే సినిమా ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యి, మంచి టాక్ సంపాదించుకుంది. కానీ, ఇంతలోనే చిత్ర బృందంలో మరో సమస్య మొదలైందట.

'నీతో' మూవీకి సంబంధించిన అప్ డేట్స్ అడపాదడపా ఆడియన్స్ ను పలకరిస్తూనే ఉన్నాయి. ట్రైలర్ చాలా డీసెంట్ గా ఉండటంతో ఓ వర్గం ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతలోనే హీరో డైరెక్టర్ కొట్టుకోవడంతో సినిమా రిలీజ్ కూడా డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. వారు గొడవపడుతున్న వీడియో బయటకు రావడంతో ఇప్పుడు మరో రభస మొదలైంది.

Neeto Hero Director fights on the release date

ట్రైలర్ రిలీజ్ కాస్త డిలే అవ్వడంతో డైరెక్టర్, హీరో మధ్య సమస్య తలెత్తినట్లు అర్ధమవుతోంది. దీనిపై వాగ్వివాదం చోటుచేసుకోవడం, మాటమాట పెరిగి ఇద్దరూ కొట్టుకునే వరకూ వచ్చిందట వ్యవహారం. అయితే తరువాత తెలిసిన విషయం ఏమీటంటే ఇది కూడా ప్రమోషన్స్ లో భాగమేనని అర్థమైంది. ఎంత ప్రమోషనల్ వీడియో అయినా, ఇద్దరూ అంత సహజంగా కొట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఏమైనా ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన 'నీతో' ఈ నెల 23వ తారీఖున థియేటర్లలో విడుదలవ్వబోతోంది. మరి ప్రతి ఫ్రేములోనూ ఆహ్లాదాన్ని నింపుకున్న నీతో ప్రేక్షకులను అదే రీతిన అలరిస్తుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X