నితీష్‌పై పవన్ ప్రశంసలు .. ఆ పాయింట్‌తో ఏకీపారేస్తోన్న నెటిజన్స్
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు , రాజకీయాలు ఒకే ఫ్రీక్వెన్సీలోనే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఏపీలో సమస్యలు తగ్గాయి అంటే తెలంగాణాలో లేటెస్ట్ గా ఊహించని ట్విస్ట్ లు టాలీవుడ్‌కి వస్తున్నాయి. ఏపీ సహా భారతదేశ రాజకీయాల్లోనే ఇపుడు కీలకంగా మారిన టాలీవుడ్ సెలెబ్రెటీ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి.
సినిమాల్లో తన పవర్ స్టార్ టాగ్ వద్దనుకున్నప్పటికీ తననిమాత్రం అది వెంటాడుతోంది. ఏపీలో రాజకీయాలు మార్చేసి ఇపుడు నిజమైన పవర్ లో ఉండి తాను పవర్ స్టార్ అనిపించుకున్నారు. ఇలా పవన్ పేరు రాజకీయాలు , సినిమాల పరంగా మారుమోగుతుండగా తనపై లేటెస్ట్ గా పలు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

పవన్ కి విపరీతమైన దేశ భక్తి కూడా ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ గా భారతదేశం అంతా మన తెలుగు యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సత్తా గురించే మాట్లాడుకుంటోంది. మాములుగా భారతీయులు సినిమాని, క్రికెట్ ని సమానంగా ఆదరిస్తారు.
అయితే మన తెలుగు నుంచి చాలా తక్కువ మంది భారత జట్టులో ఉంటారని అందరికీ తెలిసిందే. ఆ మధ్యనే అంబటి రాయుడు కూడా రిటైర్ అయ్యిపోయారు. కాగా ఇప్పుడు వెళ్లిన నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటడంపై పవన్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ పై ఇపుడు నార్త్ ఆడియెన్స్ మండిపడుతున్నారు. నితీష్ కుమార్ రెడ్డిని పొగుడుతూ పవన్ "భారతదేశంలో నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు అన్నది కాదు నీ భారత భూమి కోసం ఏం చేసావు అనేది చరిత్రలో ఉంటుంది. అలాంటి చరిత్రని నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీతో అద్భుతం చేసాడు" అంటూ చాలా పెద్ద పోస్ట్ పెట్టారు పవన్.
అయితే నితీష్ మన తెలుగు కుర్రాడు కావడంతోనే పవన్ ఆ పోస్ట్ పెట్టారు అని అందరికీ తెలుసు. కానీ ఈ పోస్ట్ లో పవన్ ప్రస్తావించిన కీలక పాయింట్‌తోనే నార్త్ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. యువ క్రికెటర్స్ లో రీసెంట్ గా ఒక్క నితీష్ మాత్రమే కాకుండా ఎంతో చిన్న కుటుంబం నుంచి వచ్చి ముద్ర వేసిన యశస్వి జైస్వాల్ గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నిస్తున్నారు.
ఇదే ఎందుకు అంటే పవన్ పెట్టిన పోస్ట్‌లోనే భారతదేశంలో ఎక్కడ నుంచి వచ్చాం అని కాదు.. మన దేశానికి ఏం చేసాం అనేది ముఖ్యం అయినపుడు మీ తెలుగు రాష్ట్రం నుంచి వచ్చిన నితీష్ కంటే ముందు యశస్వి గురించి ఎందుకు ఇలా పోస్ట్ చెయ్యలేదు అంటున్నారు. దేశంలో ఎక్కడ నుంచి వస్తే ఏంటి? మీరు చెప్పిందే కదా అని చాలా కామెంట్స్ పవన్ విషయంలో వస్తున్నాయి.
అలాగే విదేశీ గడ్డపై సెంచరీ చేసిన యంగ్ ప్లేయర్స్ లో నితీష్ ఏమి మొదటి వాడు కాదని సచిన్, రిషబ్ పంత్ లు ఇంకా చిన్న వయస్సులోనే సెంచరీలు చేసారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారు చెప్పిన దానిలో కూడా లాజిక్ ఉందనే చెప్పాలి . సో పవన్ ఈ తరహా పోస్టింగులు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే డెఫినెట్ గా ఇలాంటి కామెంట్స్ ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











