ఆ రూట్లో RRRకు నెగిటివ్ టాక్.. రాజమౌళి ముందే చెప్పినా వినలేదు.. రిలీజ్ చేసి వేస్ట్!

రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ RRR సినిమా శుక్రవారం రోజు గ్రాండ్ గా విడుదలైంది. మొత్తానికి అనుకున్నట్లే సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను అందుకోవడం స్టార్ట్ చేసింది. సినిమా సక్సెస్ అయింది అంటూ అభిమానులు కూడా చాలా ఆనందంలో ఉన్నారు. అయితే ఈ తరుణంలో సినిమాకు ఒకవైపు నుంచి మాత్రం నెగిటివ్ టాక్ వైరల్ గా మారుతుంది. రాజమౌళి ముందే ఆ విషయాన్ని ముందే గ్రహించినప్పటికీ కూడా ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదు. అసలు వివరాల్లోకి వెళితే..

ఫస్ట్ లోనే పాజిటివ్ టాక్

ఫస్ట్ లోనే పాజిటివ్ టాక్


నిజజీవితంలోని ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్లను ఆధారంగా చేసుకున్న రాజమౌళి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ను కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రజెంట్ చేసి RRR సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాను హై వోల్టేజ్ ఎమోషనల్ సన్నివేశాలలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించారు. మొత్తానికి సినిమా అయితే మొదటి రోజు ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా రివ్యూవర్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది.

నెగిటివ్ టాక్

నెగిటివ్ టాక్

సినిమా మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని కూడా ఇప్పటికే ఒక నమ్మకం వచ్చేసింది. ఇక ఆ కలెక్షన్స్ ఎన్ని రోజుల వరకు మొనసాగుతాయి అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కానీ ఒక రూట్లో మాత్రం RRR సినిమాకు నెగిటివ్ టాక్ ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగానే ఈ విషయంలో రాజమౌళికి ఒక క్లారిటీ ఉన్నప్పటికీ మళ్లీ ఆయన ఆ పొరపాటు చేయక తప్పలేదు

 చివరి నిమిషంలో ప్లాన్ చేంజ్

చివరి నిమిషంలో ప్లాన్ చేంజ్


RRR సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయడం జరిగింది ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ స్థాయిలో విడుదల కాలేదు. ఆ విధంగా సినిమాను విడుదల చేసిన రాజమౌళి 3D వెర్షన్ లో కూడా ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మళ్ళీ ప్లాన్ మారింది. తక్కువ థియేటర్స్ లోనే విడుదల చేశారు. అసలు అయితే ఈ సినిమాను త్రీడీలో రిలీజ్ చేయాలని మొదట ఏ మాత్రం అనుకోలేదు.

 అలా ఆఫర్ రావడంతో..

అలా ఆఫర్ రావడంతో..


సినిమాను జనవరిలో విడుదల చేయాలి అనుకున్నప్పుడు అంతకుముందే త్రీడీ టెక్నాలజీతో సినిమాను విడుదల చేస్తే ఇంకా బాగుంటుంది అని కొన్ని కంపెనీలు ఆఫర్ చేశాయట. అయితే ముందుగా కొన్ని షార్ట్స్ ఇస్తే వాటిని 3D డిజైన్ చేసి ఇస్తామని కూడా రాజమౌళి కి ఆఫర్ చేశారట. ఇక రాజమౌళి ఒక రెండు వందల సీన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొదట ఆ రూట్లో వెళ్ళకూడదు అని రాజమౌళి చాలని అనుకున్నాడట. అసలు తనకు త్రీడీ అంటే ఇష్టం ఉండదు అని కూడా రాజమౌళి చెప్పాడు.

అలా ఫోకస్ చేసిన రాజమౌళి

అలా ఫోకస్ చేసిన రాజమౌళి

ఇక త్రీడీలో సదరు కంపెనీ సీన్స్ ను కరెక్ట్ గా డిజైన్ చేయడంతో రాజమౌళికి చాలా బాగా నచ్చిందట. వెంటనే త్రీడీలో కూడా సినిమాను విడుదల చేయాలి అని జనాలు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అని ఆ తర్వాత ఆ వర్క్ కోసం కూడా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చింది. జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడడంతో అప్పుడే త్రీడీకి సంబంధించిన పనులలో రాజమౌళి ఎక్కువగా ఆలోచించాడట.

Recommended Video

RRR Review: NTR, Ram Charan కెరీర్‌లో ది బెస్ట్ SS Rajamouli అంకితభావం | Filmibeat Telugu
రాజమౌళి మెప్పించలేకపోయాడు..

రాజమౌళి మెప్పించలేకపోయాడు..


అయితే ప్రస్తుతం మాత్రం త్రీడీ ఫార్మాట్లో ఈ సినిమాని చూసిన కొంత మంది ప్రేక్షకులు ఏమాత్రం పాజిటివ్ గా స్పందించడం లేదు. 3Dలో చూడడం కంటే 2Dలో నార్మల్గా చూడడమే బెటర్ అని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్దగా త్రీడిలో సినిమాను విడుదల చేయలేదు. ముఖ్యంగా హైదరాబాద్లో ఆన్లైన్లో ఒకే ఒక్క థియేటర్ కు సంబంధించిన టికెట్లు అమ్మకానికి పెట్టడం విశేషం. ఏదేమైనా రాజమౌళి మాత్రం 3డీ ఫార్మాట్లో అనుకున్నంతగా మెప్పించలేకపోయాడు అని కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X