ప్రభాస్ అంటే దేశానికి డార్లింగ్.. బాలీవుడ్ విలన్ ప్రశంసలు
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండేళ్లుగా ప్రేక్షకులందరూ ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతో రూపొందిన ఈ చిత్రం స్వాత్రంత్య దినోత్సం ఆగస్టు 15వ తేదీ సందర్భంగా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సందర్భంగా సాహో ప్రమోషన్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ మాట్లాడుతూ.. ప్రభాస్ అంటే జాతికే డార్లింగ్ అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

ప్రభాస్‌తో పనిచేయడమంటే కచ్చితంగా ఓ అరుదైన గౌరవంగా భావిస్తాను. సాహో కంటే ముందు ప్రభాస్ నటించిన చాలా సినిమాలు చూశాను. ఎప్పడూ ప్రభాస్ గొప్ప యాక్టర్ అనే ఫీలింగ్‌తో ఉండేవాడిని. ఓ సినిమా కోసం ఐదేళ్లు అంకితభావంతో పనిచేయంతో ఆయనకు ఫ్యాన్ అయిపోయాను. మరెన్నో సినిమాల్లో ఆయనతో నటించే ప్రయాణాన్ని కోరుకొంటున్నాను. సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని ఆయనతో నటించడానికి ఎప్పుడూ ముందుంటాను అని అన్నారు.
ప్రభాస్‌ను అభిమానులందరూ దేశవ్యాప్తంగా డార్లింగ్ అని పిలుచుకొంటారు. అతనితో పనిచేసిన తర్వాత అతడిని డార్లింగ్ అని ఎందుకంటారో నాకు అర్థమైంది. గొప్ప స్టార్ స్టేటస్ ఉన్న అతి సాధారణమైన వ్యక్తి ప్రభాస్ అంటూ నీల్ ప్రశంసలతో ముంచెత్తారు.
సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సాహో చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు శ్రద్దాకపూర్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి, చంకీ పాండే నటించారు.


Click it and Unblock the Notifications











