Dhanush's Nene Vasthunna హీరోగా.. విలన్‌గా ద్విపాత్రాభినయంతో ధనుష్.. యాక్షన్ సీన్లు చూస్తే వణుకు ఖాయం!
తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించిన తిరు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మ్యాజిక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్న ధనుష్ మరోసారి భారీ అంచనాలతో నేనే వస్తున్నా (తమిళంలో నానే వారువీన్) మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. వీ క్రియేషన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి థాను నిర్మించారు.

వెన్నులో చలి పుట్టించేలా
నానే వారువీన్ సినిమా టీజర్‌ను (తెలుగులో నేను వస్తున్నా) రెండు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కు వస్తున్న రెస్సాన్‌ను చూసి చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ టీజర్ బ్యాక్‌గ్రౌండ్లో వచ్చే వీరా శూర పాటలో కనిపించే దృశ్యాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడమే కాకుండా వెన్నులో చలి కూడా పుట్టిస్తాయి. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా, విలన్‌గా రెండు పాత్రల్లో కనిపించడం విశేషంగా మారింది.

సెల్వరాఘవన్ టేకింగ్
నానే వారువీన్ టీజర్‌తో దర్శకుడు సెల్వ రాఘమన్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ధనుష్ లుక్స్, రక్తసిక్తమైన యాక్షన్ సన్నివేశఆలు, యువన్ రాజా సంగీతం టీజర్‌లో హైలెట్‌గా కనిపించాయి. ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్న సినిమాను సెప్టెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ధనుష్, సెల్వరాఘవన్ మరో మ్యాజిక్
నానే వారువీన్ చిత్రానికి ధనుష్ స్వయంగా కథను అందించడం ఒక ఎత్తైతే.. సెల్వరాఘవన్ అద్బుతంగా తెరకెక్కించడం మరో ఎత్తుగా మారింది. ఇద్దరు సహోదరులు ధనుష్, సెల్వ రాఘవన్ ఈ సినిమాతో మ్యాజిక్ చేయబోతున్నారనేది టీజర్ స్పష్టం చేసింది.

పొన్నియన్ సెల్వన్‌తో పోటీగా
నేనే వస్తున్నా చిత్రంలో ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాం, ప్రభు, యోగిబాబు, షెల్లీ కిషోర్, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు పొన్నియన్ సెల్వన్ చిత్రం రిలీజ్‌కు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











