twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరువు హత్యల నేపథ్యంతో నేను c/o నువ్వు.. ప్రీమియర్ షోలో రాజకీయ, సీనీ వర్గాల ప్రశంసల వర్షం

    |

    మంచి కంటెంట్‌తో వస్తున్న చిన్న బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పెద్ద సినిమాలతో పోటీ పడుతూ భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. నూతన నటీనటులు, వినూత్న ఆలోచనలతో దర్శకులు రూపొందిస్తున్న సినిమాలు సినీ విమర్శకులను ఆకట్టుకొంటున్నాయి. అలాంటి తరహా చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉన్న సినిమా నేను c/o నువ్వు. నూతన నటీనటులు, దర్శకులు రూపొందించిన చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోను ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

    ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్, సన్య సిన్హా, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీ నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ నేను c/o నువ్వు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి అత్తావలి , శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కే జోషఫ్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన మోషన్ పోస్టర్‌, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 30 తేదీన గ్రాండ్‌గా విడుదల అవుతున్నది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సినీ, రాజకీయ ప్రముఖులకు, పాత్రికేయులకు, యూట్యూబర్లకు ప్రీమియర్ షోను ప్రదర్శించడం జరిగింది.

    Nenu C/o Nuvvu

    నేను c/o నువ్వు ప్రీమియర్ షో అనంతరం మీడియా సమావేశంలో నిర్మాతలు , రాజకీయ నాయకులు ఎమోషనల్‌గా స్పందించారు. నేను c/o నువ్వు సినిమా చాలా బాగుంది. మనం ఈ మధ్య కులం పేరుతో ఇంకా పరువు హత్యలు జరుగుతుండడం మనం చూస్తునే ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరువు హత్యల సినిమాలు థియేటర్స్‌కు కచ్చితంగా రావాలి. ఈ సినిమాల వలన ప్రేక్షకులలో ఇంకా అవగాహన పెరుగుతుంది. చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడు అని పలువురు ప్రశంసల వర్షం కురిపించారు.

    English summary
    Nenu C/o Nuvvu movie is coming to theatres on September 30th. As part of promotions, This movie has premiered in hyderada.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X