twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియల్ స్టోరిగా నేను C/o నువ్వు.. యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ ఎప్పుడంటే?

    |

    ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్, సన్య సిన్హా, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం నేను c/o నువ్వు. ఈ చిత్రానికి అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కే జోషఫ్ సహ నిర్మాతలు. ఈ చిత్రం నుంచి విడుదలైన మోషన్ పోస్టర్‌, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 16న గ్రాండ్‌గా విడుదల అవుతున్నది. ఈ సందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత సాగారెడ్డి తుమ్మ చిత్ర విశేషాల గురించి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

    Nenu care of nuvvu to be released on 16th September

    1980 సంవత్సరంలో జరిగిన వాస్తవ కథ ఇది. పల్లెటూరులో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి కుటుంబాల మధ్య జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ద్వారా ప్రేమ మనిషిని జయిస్తుంది. ఈ సినిమాలో చెప్పడం జరిగింది. మా సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్‌, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది అని అన్నారు.

    మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేను కేరాఫ్ నువ్వు సినిమా నుంచి ఐదు నిమిషాల స్నీక్ పీక్ కంటెంట్‌ను విడుదల చేస్తున్నాం. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అని సాగారెడ్డి తుమ్మ అన్నారు.

    మ్యూజిక్ డైరెక్టర్ ఎన్ఆర్ రఘునందన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రాఫర్ కృష్ణ ప్రసాద్ తీసిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ నెల 16 తేదీన థియే టర్స్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేను C/o నువ్వు సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

    నటీ నటులు: రత్న కిషోర్, సన్య సిన్హా, సత్య, ధన, గౌతమ్ రాజ్, సాగారెడ్డి తదితరులు
    బ్యానర్: అగపే అకాడమీ
    కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శక, నిర్మాత: సాగా రెడ్డి తుమ్మ
    సహ నిర్మాతలు: అతుల, శేష్ రెడ్డి, పోలిష్ వెంకట్ రెడ్డి, కే జోషఫ్
    డీవోపీ: జీ కృష్ణ ప్రసాద్
    లిరిక్స్: ప్రణవం
    కొరియోగ్రాఫర్: నరేష్
    మ్యూజిక్: ఎన్ఆర్ రఘునందన్
    ఆర్ట్: పీఎస్ వర్మ
    యాక్షన్: షొలిన్ మల్లేష్

    English summary
    Nenu care of nuvvu to be released on 16th September ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్, సన్య సిన్హా, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం నేను c/o నువ్వు. ఈ చిత్రానికి అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కే జోషఫ్ సహ నిర్మాతలు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X