శృంగారభరితంగా నేను లేను.. తెర మీద ఎప్పుడూ చూడని విధంగా.. మే 24న
ఓయస్‌యం విజన్, దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నేను లేను. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉపశీర్షిక. హర్షిత్ హీరో. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఏకంగా 7.5 మిలియన్ వ్యూస్‌ను అందుకోవడం మీడియా, సినీ సర్కిళ్లలో చర్చనీయాంశమైంది.
టాలీవుడ్‌లో క్రేజీగా మారిన నేను లేను సినిమా గురించి దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ -ఒక అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది. ట్రైలర్‌కు అనూహ్య స్పందన రావడం సంతోషం కలిగిస్తున్నది. 7.5 మిలియన్ వ్యూస్‌ను మా ట్రైలర్ రీచ్ అయింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీసిన సినిమా ఇది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికేట్ లభించింది. అని అన్నారు.

నేను లేను సినిమా మే 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఇప్పటివరకు రానీ చూడని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రం ఇది అని రాంకుమార్ అన్నారు.
నేను లేను సినిమాలో హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటిస్తున్నారు.
సంగీతం: ఆశ్రిత్,
ఛాయాగ్రహణం: ఎ శ్రీకాంత్ (బీఎఫ్‌ఏ)
నృత్యాలు: జోజో
నిర్వాహణ: సురేష్ కూరపాటి
పిఆర్‌వో: సాయి సతీష్ పాలకుర్తి
వీఎఫ్ఎక్స్: ప్రభురాజ్
ఎస్ఎఫ్ఎక్స్: పురుషోత్తం రాజు
ఆడియోగ్రఫీ: రంగరాజ్
కలరిస్ట్: కళ్యాణ్ ఉప్పాలపాటి
ప్రచార చిత్రాలు: శ్రీక
సహాయ దర్శకులు: జె.మోహన్ కాంత్, ధర్మేంద్ర, సురేశ్
సహనిర్మాత: యషిక
నిర్మాత: సుక్రి కుమార్
రచన- దర్శకత్వం: రామ్ కుమార్ ఎమ్ఎస్‌కె.


Click it and Unblock the Notifications











