నేను మీకు బాగా కావాల్సినవాడిని ట్విట్టర్ రివ్యూ: కిరణ్ ఖాతాలో మరొకటి.. బాబా భాస్కర్ ఎలా చేశాడంటే!
బ్యాగ్రౌండ్ లేకపోయినా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లోకి ఎంతో మంది కుర్రాళ్లు హీరోగా వస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తద్వారా గ్రాండ్ ఎంట్రీని అందుకుంటున్నారు. అలాంటి వారిలో రాయలసీమ చిన్నోడు కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. 'ఎస్ఆర్ కల్యాణమండపం' అనే సినిమాతో భారీ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అనే మూవీతో వచ్చాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

బాగా కావాల్సినవాడిని అంటూ
కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రమే 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ సినిమాలో సంజన ఆనంద్, సోను ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. కోడి రామకృష్ణ సమర్పణలో, కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్య దీప్తి నిర్మించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతాన్ని అందించారు. ఇందులో బాబా భాస్కర్ కీలక పాత్రను పోషించారు.

అలాంటి కథతో వచ్చిన మూవీ
విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా కమర్షియల్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీ.. ఒక కారు డ్రైవర్ ధనవంతుల కుమార్తెను ప్రేమించడం, ఆమె కోసం వాళ్ల ఇంటికి వెళ్లి ఫైటింగులు చేయడం వంటి అంశాలతో ఈ సినిమా రూపొందింది.

అంచనాలు తగ్గట్లుగా బిజినెస్
పక్కా కమర్షియల్ జోనర్‌లో వచ్చిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా ప్రమోషన్ సరికొత్తగా సాగింది. అందుకే దీని నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

కిరణ్ అబ్బవరం మూవీకి టాక్
టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీ మాస్ కమర్షియల్ అంశాలతో రూపొందింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్లా మంచి టాక్ వచ్చింది. చాలా మంది ఈ మూవీ బాగుందని ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా
కమర్షియల్ హంగులతో రూపొందిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం చేయడం.. ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడం.. కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగిపోతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం మాస్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో సాగుతుందట. కానీ, క్లైమాక్స్ మాత్రం కొత్తగా అనిపించదని టాక్.

సినిమాలో ప్లస్.. మైనస్‌లు ఇవే
'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. కిరణ్ అబ్బవరం నటన, బాబా భాస్కర్ కామెడీ, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్ ఈ చిత్రానికి ప్లస్ అని తెలిసింది. అయితే, కొన్ని సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ రొటీన్‌గా ఉండడం, పాటలు, ఎమోషన్స్ పండకపోవడంతో ఈ చిత్రానికి మైనస్‌గా మారాయనే టాక్ వినిపిస్తోంది.

ఫైనల్‌గా సినిమా ఎలా ఉంది?
ట్విట్టర్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' పక్కా మాస్ కమర్షియల్ మూవీగా వచ్చేసింది. ఇందులో యూత్‌ను ఆకట్టుకునే లవ్ స్టోరీతో పాటు యాక్షన్ సీన్స్ చాలా ఉండడం కలిసొచ్చే అంశమనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సినిమా అని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు.

కిరణ్‌కు మరొకటి.. బాబా హైలైట్
'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ దీనికి టాక్ మంచిగానే వచ్చింది. ఇదే కంటిన్యూ అయితే కిరణ్ అబ్బవరం మరో హిట్ కొట్టే అవకాశం ఉంది. ఇక, ఇందులో కీలక పాత్ర పోషించిన కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కామెడీ హైలైట్‌గా నిలిచిందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











