థియేటర్‌లోనే లెగసీ ఆఫ్ లైస్ రిలీజ్.. ఓటీటీలో ఆ తర్వాతే.. బల్వంత్ సింగ్
లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ ఫ్లాట్‌ఫాంలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. చాలా సినిమాలు ఓటీటీలో రిలీజై ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనుకొన్న చిత్రాలన్నీ థియేటర్లలోకి రావడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో హాలీవుడ్ చిత్రం లెగసీ ఆఫ్ లైస్ ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నది. ఆ తర్వాత NET 5 అనే ఓటీటీలో రిలీజ్ అవుతుందని కంపెనీ సీఈవో బల్వంత్ సింగ్ తెలిపారు.
లెగసీ ఆఫ్ లైస్ చిత్రం ప్రైమ్ ఒరిజినల్స్ సమర్పణలో నెట్ 5 డిజిటల్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో స్కాట్ ఆడికిన్స్, అన్నా బత్కేవిచ్, యూలియా తదితరులు నటించారు. లెగసీ ఆఫ్ లైఫ్ చిత్రం తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీలో ఏజెంట్ ఎం-6' టైటిల్‌తో రిలీజ్ కానున్నది.

నెట్ 5 సంస్థ సీఈవో బల్వంత్ సింగ్ మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో రూపొందిన పలు సినిమాలను భారతీయ భాషల్లోకి అనువదించి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. లెగసీ ఆఫ్ లైస్ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది అని అన్నారు. ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే రిలీజ్ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాం అని తెలిపారు.


Click it and Unblock the Notifications











