Don't Miss!
- News
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి నిరసనసెగ.. ఆగ్రహించిన ఎమ్మెల్యే, టార్గెట్ చేసిన టీడీపీ!!
- Sports
కింగ్ ఈజ్ బ్యాక్.. పాకిస్థాన్‌కు దబిడి దిబిడే! 100వ మ్యాచ్‌లో చుక్కలే.. కోహ్లీ ఫ్యాన్స్ ధీమా!
- Technology
దేశంలోని Broadband ప్లాన్స్‌లో బెస్ట్ ప్లాన్ ఏదో తెలుసా..!
- Finance
Super Offer: నిద్రపోయినందుకు బోలెడంత జీతం.. కంపెనీ సూపర్ ఆఫర్.. పోటీపడి దరఖాస్తులు..!
- Automobiles
భారత్‌లో పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ RZR Pro R Sport విడుదల.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Lifestyle
మన జాతీయ జెండా ఏర్పడటం వెనుక ఉన్న చారిత్రక కథ మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
Anushka Sharma తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ కళ్లు చెదిరే డీల్.. ఎన్ని వందల కోట్ల ఒప్పందమంటే?
ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేని పరిస్థితుల్లో ఓటీటీలు దుమ్మురేపుతున్నాయి. విభిన్నమైన చిత్రాలు, వెబ్ మూవీస్, వెబ్ సిరీస్, గేమ్ షోలతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వంద కోట్లకుపైగా జనాభా ఉన్న దేశంపై ఓటీటీ సంస్థలు భారీగా గురిపెట్టాయి. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ తమ కంపెనీ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను 60 శాతానికిపైగా కోత పెట్టింది. తక్కువ ధరకే నెట్‌ఫ్లిక్స్ వాడుకొనే సదుపాయాన్ని కల్పించి యూజర్లను భారీగా పెంచుకొనే ప్లాన్ అమలు చేస్తున్నది.
ఈ క్రమంలో బాలీవుడ్ నటి, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సొంత సినీ నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్‌తో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ భారీ ఒప్పందం కుదుర్చుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా 8 సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మించడానికి వీరి మధ్య ఒప్పందం కుదుర్చుకొన్నది. రానున్న 18 నెలల్లో ఈ సినిమాలు పూర్తి చేసి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి విలువ 400 కోట్లకుపైగా అంటే 54 మిలియన్ డాలర్ల మేర ఒప్పంద జరిగింది అని మీడియా కథనాలు వెల్లడించాయి.

అనుష్క శర్మకు సంబంధించిన క్లీన్ స్లేట్ ఫిల్మ్స్‌తో ఒప్పందం గురించి నెట్‌ఫ్లిక్స్ స్పందించింది. ఆ సంస్థతో మూడు సినిమాలు నిర్మిస్తున్నాం అని ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా అమెజాన్ ఈ భారీ డీల్ గురించి స్పందించాల్సి ఉంది.
క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ సంస్థ విషయానికి వస్తే.. 2015లో అనుష్మ శర్మతో ఎన్‌హెచ్ 10 అనే చిత్రాన్ని నిర్మించింది. లాక్‌డౌన్‌లో పాతాళ్ లోక్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులకు అందించింది. ప్రస్తుతం ఓ ఇండియన్ క్రికెటర్ జీవితం ఆధారంగా చక్దా ఎక్స్‌ప్రెస్ అనే సినిమాను అనుష్క శర్మతో రూపొందిస్తున్నది. అలాగే మాయ్, ఖాలా అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నద.ి