For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాని ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ హక్కులు ఆ ఓటీటీకే: ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందంటే!

  |

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా అద్భుతమైన టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. ప్రతి సినిమాలోనూ సహజ సిద్ధమైన నటనను కనబరిచే అతడు.. అన్నింటినీ వన్ మ్యాన్ షోలుగా మార్చుకున్నాడు. తద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'టక్ జగదీష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి మంచి స్పందనే వచ్చింది.

  MAA Elections: ప్యానెల్‌ను ప్రకటించిన మంచు విష్ణు.. ఆ సినీ జంటకు రెండు పదవులు.. సంపూ కూడా!

  'టక్ జగదీష్' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే నేచురల్ స్టార్ నాని మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో 'ట్యాక్సీవాలా'తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో వస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' ఒకటి. పూర్తి స్థాయి విభిన్నమైన కథతో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

   Netflix Bagged Nanis Shyam Singha Roy Digital Right

  'శ్యామ్ సింగ రాయ్' మూవీలో వీఎఫ్ఎక్స్ షాట్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అందుకే ఇది షూటింగ్‌ను ఎప్పుడో పూర్తి చేసుకున్నా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా కూడా 'టక్ జగదీష్' మాదిరిగానే ఓటీటీలో నేరుగా విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, దీన్ని మాత్రం థియేటర్లలోనే విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. అదే సమయంలో నేచురల్ స్టార్ నాని కూడా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని స్ఫష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

  క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'శ్యామ్ సింగ రాయ్' మూవీ డిజిటల్ రైట్స్ తాజాగా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఇందుకోసం చిత్ర యూనిట్‌కు భారీ మొత్తాన్ని చెల్లించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, దీన్ని థియేటర్లలో సినిమా విడుదలైన యాభై రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ చేయడానికి ఒప్పందం కూడా చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి స్థాయి వైవిధ్యమైన కథతో రాబోతున్న 'శ్యామ్ సింగ రాయ్' నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులో నాని కోరమీసంతో కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఇక, ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకట్ బోయినపల్లి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక, ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Natural Star Nani Did Shyam Singha Roy Movie Under Shyam Singha Roy Direction. Now Netflix Bagged This Movie Digital Rights.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X