Pushpa 2 OTT Business: పుష్ప 2 ఓటీటీ హక్కుల కోసం కళ్లు చెదిరే డీల్.. ఆల్‍టైమ్ రికార్డ్స్ బ్రేక్

Pushpa 2 OTT Digital Rights Price: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ కాంబో తెరకెక్కుతున్న మూవీ 'పుష్ప 2: ది రూల్'. ఈ సినిమా విడుదల కోసం వర్డల్ వైడ్ గా కోట్లాదిమంది అభిమానులు నిరీక్షిస్తున్నారు. మూడేండ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప: ది రైజ్' అనే సినిమా నేషనల్ వైడ్‍గా భారీ బ్లాక్‍బస్టర్ రికార్డు క్రియేట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో అదరగొట్టింది. దీంతో పుష్ప 2 పై నేషనల్ వైడ్‍గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి భారీ బడ్జెట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇంతకీ ఆ అప్టేడ్ ఏంటంటే..?

మూవీ మేకర్స్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. పుష్ప 2 మూవీ డిసెంబర్ 6 వర్డల్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్స్, గ్లింప్స్, పోస్టర్స్ అంటూ ఇచ్చిన అప్డేట్స్ మాత్రం.. ఈ మూవీ ఇండియాలోని అన్ని రికార్డులను బద్దలుకొడుతుందనే అంచనాలను క్రియేట్ చేసింది. అయితే.. ఈ భారీ బడ్జెట్ మూవీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన కీ అప్డేట్ వచ్చింది.

Netflix has acquired the OTT streaming rights Of allu arjun Pushpa 2 for a record Rs 270 crores

గత కొంతకాలంగా 'పుష్ప 2: ది రూల్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంపై రూమర్లు వస్తుండగా.. ఇప్పుడు ఒప్పందం ఖరారైంది. ఈ మూవీ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ కనబడుతోంది. టాప్ ఓటీటీ ప్లాట్ ఫారం అయిన నెట్‌ఫ్లిక్స్.. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ మూవీకి చెల్లించని అమౌంట్ పెట్టి మరీ పుప్ప 2 హక్కులను కొనుగోలు చేసింది. అన్ని భాషలకు కలిపి ఏకంగా రూ.270కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‍ఫ్లిక్స్ కైవసం చేసుకున్నట్టు సమాచారం.

డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో 'పుష్ప 2: ది రూల్' సినిమా ఆల్‍టైమ్ రికార్డు క్రియేట్ చేసిందనీ, ఇండియా ఏ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ఖర్చు చేయని విధంగా అత్యధిక ధరకు అమ్ముడుపోయిన డిజిటల్ రైట్స్ మూవీగా నిలిచింది.

ఇదిలా ఉంటే.. పుష్ప 2 మేకర్స్ ఎప్పటికప్పుడూ గ్లింప్స్, సాంగ్స్, ప్రొమో అంటూ.. అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలను అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ హీరో నటించగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా.. ఫహద్ ఫాసిల్ విలన్ గా ధనంజయ, జగదీష్ ప్రతాప్ బండారి, రావు రమేష్, అజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Netflix has acquired the OTT streaming rights Of allu arjun Pushpa 2 for a record Rs 270 crores

ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2021 డిసెంబర్‌లో రిలీజైన పుష్ప చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ మారింది. దాదాపు మూడేండ్లు అవుతున్న అల్లు అర్జున్ యాక్టింగ్, మేనరిజమ్స్, స్వాగ్ ను ప్రేక్షకులు మరిచిపోలేదు. ఈ పాత్రకు నేషనల్ వైడ్‍గా మంచి గుర్తింపు రావడంతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు వచ్చింది. పుష్ప 2 కు అదే లెవెల్ హిట్ వస్తుందని ఇండస్ట్రీ టాక్.

More from Filmibeat

Read more about: pushpa 2 allu arjun netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X