For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Money Heist Telugu చేస్తే ఇలా ఉంటుందా? ప్రొఫెసర్ గా మారిన తరుణ్ భాస్కర్ !

  |

  'మనీ హీస్ట్' ఇండియాలో అత్యధిక ఓటీటీ ప్రేక్షకుల ఫేవరెట్ వెబ్‌ సీరిస్ ఇదేనని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ టీవీ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్‌ ఏర్పడ్డారు మరీ ముఖ్యంగా పెద్దగా ఇతర బాషల సిరీస్ లను ఎంకరేజ్ చేయని మన తెలుగు వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కువ మంది చూసిన నాన్‌-ఇంగ్లీష్‌ సిరీస్‌ గా దీనికి పేరు వచ్చింది. ఈ సిరీస్ తెలుగులో సహా ఇతర భాషలలో విడుదల కాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ మరో ప్రమోషనల్ వీడియో చేసింది. అది కూడా తరుణ్ భాస్కర్ సారధ్యంలో. ఆ వివరాల్లోకి వెళితే

  ప్రమోట్ చేసే పనిలో

  ప్రమోట్ చేసే పనిలో

  మనీ హీస్ట్ లోని ప్రొఫెసర్ పాత్రకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే, నిజానికి ముందు ఈ వెబ్‌ సీరిస్ స్పానిష్ భాషలోనే ఉండేది, కానీ ఇండియాలో ఈ సీరిస్‌కు లభిస్తున్న ఆధరణ దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటు హిందీ, తమిళ్ తదితర భాషల్లోకి కూడా అనువదించారు. ప్రపంచంలో.. అత్యధిక ప్రేక్షకులు వీక్షించే పరభాష వెబ్ సీరిస్ ఇదే కావడంతో మరింత దీనిని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు.

  వాల్యూం వన్ రిలీజ్

  వాల్యూం వన్ రిలీజ్


  ఇంగ్లీష్ వెబ్‌ సీరిస్‌ లను తలదన్ని మరీ ఈ వెబ్‌ సీరిస్ ముందుకు దూసుకు వెళుతుంది అంటే ఈ సిరీస్ ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే రెండు సీజన్లు.. నాలుగు పార్టులుగా ప్రసారమైన ఈ వెబ్‌సీరిస్ 5వ పార్టుతో ముగియనున్నట్లు చెబుతుండగా దానికి సంబంధించిన వాల్యూం వన్ రిలీజ్ అయింది.

  రియో చనిపోవడం

  రియో చనిపోవడం


  సెప్టెంబరు 3 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్' ఓటీటీలో రెండో సీజన్ చివరి పార్ట్ స్ట్రీమింగ్ అవుతోంది. చివరి భాగంలో మాస్టర్ మైండ్ ప్రొఫెసర్ చనిపోతారు అని ప్రచారం జరగగా ఎవరూ ఊహించని విధంగా టోక్యో చనిపోయింది. పోలీసులకు పట్టుబడిన రియోను కాపాడేందుకు ప్రోఫెసర్ ఘరానా దోపిడీకి ప్లాన్ వేసి పోలీసులకు హెచ్చరికలు పంపి ప్లాన్ చేయగా చివరికి ఆమె చనిపోవడం సంచలనంగా మారింది.

  తరుణ్ భాస్కర్ వీడియో

  తరుణ్ భాస్కర్ వీడియో

  అయితే ఈ సీజన్ ను ప్రమోట్ చేసే పనిలో పడ్డ నెట్ఫ్లిక్స్ సంస్థ తెలుగులో టాప్ దర్శకుడిగా ఉన్న తరుణ్ భాస్కర్ అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీనటులతో ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒకవేళ మనీ హీస్ట్ కనుక తెలుగు వాళ్ళు చేసుంటే ఎలా ఉండేది అనే కాన్సెప్టుతో ఈ వీడియోను రూపొందించారు.

  తెలుగు పాత్రలతో

  తెలుగు పాత్రలతో

  ఇక ఈ వీడియో లో ప్రొఫెసర్ గా తరుణ్ భాస్కర్ కనిపించగా, రజినీకాంత్ నరసింహ సినిమా నుంచి నీలాంబరి అలియాస్ వైజాగ్ ఒక నటిని చూపించారు. ఇక రోబోలో చిట్టి పాత్రధారిలా మరో నటిని చూపించి చిట్టి రోబో అలియాస్ మహబూబ్నగర్ అని చూపించారు. ఇక అరుంధతిలో పశుపతి రోల్ వేయించిన నటుడిని గద్వాల్ అనే పేరుతో చూపించారు.

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  లోకల్ మేడ్

  లోకల్ మేడ్


  చంద్రముఖి పాత్రను కడపతో, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి మహాదృష్ట అనే పాత్రను శ్రీకాకుళం పేరుతో చూపారు. ఇక బాహుబలి సినిమా నుంచి భల్లాలదేవ పాత్ర పేరుతో మాహిష్మతి అనే పేరును ఇండికేట్ చేస్తూ కొంతమంది నటీనటులను చూపించారు. ప్రొఫెసర్ వీరందరి చేత జూబ్లీహిల్స్ లో ఉన్న బ్యాంకు దొంగతనం చేయించగా మిగతా టీమ్ అందరికీ దొంగనోట్లు వస్తాయి. కానీ నిజమైన నోట్లతో ప్రొఫెసర్ జరిగునట్లుగా చూపించారు. మొత్తం మీద ఈ ప్రమోషనల్ వీడియో మాత్రం హైలెట్గా మారింది.

  English summary
  Recenly Netflix India releases a video What If Money Heist Was Made In Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X