twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌ ఎఫెక్ట్.. నాగార్జున సినిమాకు నెట్‌ఫ్లిక్స్‌ భారీ ఆఫర్.. పోటీగా హాట్ స్టార్!

    |

    కింగ్ నాగార్జున కేవలం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తన రియాలిటీ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకోగలడని ఎవరు ఊహించలేదు. మొదట మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు వ్యాఖ్యాతగా ఉన్నప్పటికీ బిగ్ బాస్ కు ఆయన సెట్ అవుతారా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ ఫైనల్ గా ఆయనే కరెక్ట్ సెట్టయ్యారు. రేటింగ్స్ చూస్తేనే ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఆయన సినిమాలపై కూడా గట్టిగానే చూపిస్తోంది.

    ఛాలెంజింగ్ గా తీసుకొని ..

    ఛాలెంజింగ్ గా తీసుకొని ..

    జూనియర్ ఎన్టీఆర్ తో గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ నాని చేసిన రెండవ సీజన్ తరువాత మళ్ళీ ఉండకపోవచ్చని క్లోజ్ కావచ్చని రూమర్స్ బాగానే వచ్చాయి. ఎందుకంటే బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతను తీసుకోవడానికి మన అగ్ర హీరోలు ధైర్యం చేయలేకపోయారు. కానీ నాగార్జున మాత్రం దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని మూడవ సీజన్ తోనే భారీ స్థాయిలో హిట్టయ్యేలా చేశారు.

    నెవర్ బిఫోర్ అనేలా రికార్డు

    నెవర్ బిఫోర్ అనేలా రికార్డు

    ఇక నాలుగవ సీజన్ ను మరో స్థాయికి తీసుకు వెళ్లినట్లు ఇటీవల బయటపడిన ఫైనల్ రేటింగ్స్ చూస్తేనే అర్ధమయ్యింది. షో స్టార్టింగ్ కు అలాగే ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చిన రేటింగ్స్ నెవర్ బిఫోర్ అనేలా రికార్డు క్రియేట్ చేశాయి. ఇక నాగార్జున కూడా ఒక విధంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడనే చెప్పాలి. దీంతో ఆయన సినిమాలకు ఆదరణ కూడా గట్టిగానే పెరిగింది.

    ఆ సినిమాకు హై డిమాండ్..

    ఆ సినిమాకు హై డిమాండ్..

    నాగార్జున నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా వైల్డ్ డాగ్. ఆర్మీ ఆపరేషన్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. పోస్టర్స్ తోనే సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. బిగ్ బాస్ లో ఉండగా ఈ సినిమా షూటింగ్ కోసం నాగ్ హోస్ట్ బాధ్యత నుంచి కొంత బ్రేక్ తీసుకొని అప్పుడు సమంతను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అప్పుడే సినిమా పేరు బాగా వైరల్ అయ్యింది.

    నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్

    నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్

    ఇక నాగార్జున వైల్డ్ డాగ్ ను ఇంకాస్త ప్రమోట్ చేస్తే క్లిక్కయ్యే అవకాశం ఉంటుందని ప్లాన్ చేసిన కొన్ని ఓటీటీ సంస్థలు డైరెక్ట్ రిలీజ్ కు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ మధ్యన మరోసారి పోటీ ఎక్కువయ్యింది. ఇక నెట్ ఫ్లిక్స్ అయితే ఒక్కసారిగా 27కోట్లతో డీల్ ను క్లోజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!

    English summary
    Akkineni nagarjuna risk schedule for wild dog movie, Akkineni Nagarjuna’s Bangarraju, a spin-off to 2016 Sankranthi blockbuster, Soggade Chinni Nayana, has been in the news for a long time. A few days back, news came out that the film will go on floors in the month of August and that the team is aiming for a December
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X