‘వైఎస్ జగన్‌ను తొక్కేసినట్టే.. అల్లు అర్జున్‌ను, పుష్ప 2 పాతాళానికి తొక్కేస్తారు’

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యేకు అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. అయితే పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా మద్దతు తెలిపడంపై టీడీపీ, జనసేన, మెగా అభిమానులు భగ్గుమన్నారు. అయితే తాజాగా మారుతి నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదంగా మారాయి. ఆ క్రమంలో నెటిజన్లు, మెగా అభిమానుల తీవ్రంగా ట్రోల్ చేస్తూ..

సుకుమార్ భార్య తబితా సమర్పిస్తుండటంతో ఐకాన్ స్టార్‌ను ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించారు. దానిపై మాట్లాడుతూ.. పుష్ప క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. అంతటి సిచ్యుయేషన్‌లో కూడా రావాలని అనుకొన్నాను. మనకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి. నాకు ఇష్టమైతే నేను వస్తా. నా మనసుకు నచ్చితే వస్తా. అదీ మీ అందరికి తెలిసిందే అంటూ కౌంటర్ ఇచ్చారు.

Netizen angry trolls on Allu Arjun and Pushpa 2 amid Icon star comments on Mega Family

అల్లు అర్జున్ అంటే మాకు కోపం రాదా? గంగోత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తీసుకొన్నాడు. అల్లు రామలింగయ్య నుంచి అందరూ ఒక్క ఫ్యామిలీగా ఉండేవారు. అలాంటి కుటుంబంలో అల్లు అర్జున్ వేస్ట్. రాజకీయంగా జగన్ పార్టీకి, వైఎస్ జగన్ ఎమ్మెల్యేకు సపోర్ట్ చేస్తాడా? అని ఓ కామన్ మ్యాన్ భగ్గుమన్నారు.


అల్లు అర్జున్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. త్వరలోనే పుష్ప 2 సినిమా వస్తున్నది. ఆయన సినిమాను ఎవరూ చూడరు. జగన్ రెడ్డిని తొక్కేసినట్టు పుష్ప 2 సినిమాను పాతాళానికి తొక్కేస్తారు.ఇక అల్లు అర్జున్ ప్యాకప్ చెప్పాల్సిందే అని మరో కామన్ మ్యాన్ అభిప్రాయపడ్డారు.


అల్లు అర్జున్‌తో మెగా ఫ్యాన్స్‌కు సంబంధం లేదు. కుటుంబపరంగా వారికి ఎలాంటి సంబంధాలు ఉనప్పటికీ మాకు సంబంధం లేదు. మెగాస్టార్ అ్లలుడు, సురేఖ అన్న కొడుకు అని మేము గంగోత్రి సినిమాకు వెళ్లాం. అంతేకానీ అల్లు రామలింగయ్య మనవడు అని వెళ్లలేదు. ఒకట్రెండు సినిమాలపై దెబ్బ పడితే ఆ నొప్పి ఏమిటో తెలుస్తుంది. అప్పుడు తాను చేసిన తప్పు ఏమిటో తెలుసుకొంటారు అని ఓ అభిమాని అన్నారు.

అయితే మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంద్ర రీ రిలీజ్ సందర్భంగా ఐకాన్ స్టార్‌పై ఘాటుగా స్పందించారు. మెగా అండ లేనిదే అల్లు అర్జున్ ఎదిగాడా? అని ప్రశ్నిస్తున్నాడు. పుష్ప 2 సమయంలో మా తడాఖా చూపిస్తాం అని వార్నింగ్ ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X