బెట్టింగ్ బంగార్రాణి యాంకర్ శ్యామల నీతులా? ఏంటి చిలకపలుకులు అంటూ నెటిజన్ల ఫైర్.. సజ్జనార్‌కు ఫిర్యాదు

టెలివిజన్ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రముఖ యాంకర్ శ్యామల ఇటీవల కాలంలో పదునైన విమర్శలతో అధికార ప్రభుత్వ నేతలను నిలదీస్తున్నది. గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రాలోని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ఆమెను అధికారిక ప్రకటించిన తర్వాత ఆమె విమర్శల ధాటిని పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ప్రశ్నలతో నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆమె బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ విడుదల చేసిన ఓ వీడియోను రిలీజ్ చేసి నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియో వివరాల్లోకి, అలాగే నెటిజన్ల కామెంట్స్ వివరాల్లోకి వెళితే..

కాకినాడ‌-రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మ‌ధ్య ఉన్న ఏడీబీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకుల మరణానికి సంబంధించిన సంఘటనపై వైసీపీ నేత యాంకర్ శ్యామల ఘాటుగా స్పందించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నీతులు చెప్పడం వరకే. ఆచరణలో ఉండవు. అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గేమ్ ఛేంజ‌ర్ మెగా ఈవెంట్‌కు హాజ‌రైన ఇద్ద‌రు అభిమానులు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోతే ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేస్తూ ఆ నెపాన్ని గ‌త ప్ర‌భుత్వం (YSRCP)పై నెట్టేసి చేతులు దులుపుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు అని విమర్శించారు.

Netizen trolls Anchor Syamala over Betting APP Promotion Complaint to VC Sajjanar

అయితే అన్ని విషయాలపై నీతులు చెప్పే ఆమె చట్ట వ్యతిరేకమైన పనులు ఎలా చేస్తారంటూ నెటిజన్లు ఓ పాత వీడియోను తీసీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బెట్టి యాప్‌ను ప్రమోట్ చేయడాన్ని తప్పపడుతున్నారు. సమాజంలో హోదాలో ఉన్న ఆ వ్యక్తి యువతను చెడుమార్గం ఎంచుకొనేలా ప్రోత్సహించడం దారుణం అంటూ నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే జనసేన సైనికులు పోస్టు చేసిన వీడియోలో యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుతూ.. క్యాసినో ఐడీ కావాలంటే.. హిందీ సైట్స్ గురించి చూసేవాళ్లం కదా.మన ఐడీలో కాల్ చేస్తే.. వాళ్లు కాల్ కట్ చేసే వాళ్లు కదా. మనకు ఎక్కువ డబ్బులు వస్తే.. మన ఫోన్ నంబర్‌ను బ్లాక్‌లో పెట్టేవారు కదా. ఇలా ఆడియో మెసేజ్‌లు పెట్టడం, ఫోన్ నంబర్లు బ్లాక్ చేయడం అక్కర్లేదండీ..అసలు ఇప్పుడు హిందీ సైట్స్ గురించి చూసే పనిలేదు అంటూ వీడియోలో చెబుతూ యాంకర్ శ్యామల కనిపించింది.

అలాగే బెట్టింగ్ యాప్ గురించి ఇంకా వివరాలు అందిస్తూ.. ఇలాంటి కష్టాలు ఇక ముందు ఉండవు. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఐడీ ప్రోవైడర్ యాప్ ఆంధ్రా365.కామ్ అంటూ తన టీషర్టుపై ఉన్న లోగోను చూపిస్తూ కనిపించింది. ఈ యాప్‌లో డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు, విత్ డ్రా చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో డిపాజిట్, 20 నిమిషాల్లో విత్ డ్రా చేసుకోవచ్చు అని శ్యామల చెప్పింది.

Netizen trolls Anchor Syamala over Betting APP Promotion Complaint to VC Sajjanar

అయితే యాంకర్ శ్యామల వీడియోను ఉద్దేశించి జనసైనికులు ఘాటుగా స్పందిస్తున్నారు. బెట్టింగ్ బంగార్రాణి శ్రీమతి ఆరే శ్యామల గారి చిలకపలుకులు మీరే చూడండి.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వైస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రా యువతను ఎంతగా తప్పుదోవ పట్టించిందో చూశారా? అంటూ పవన్ అభిమానులు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

యాంకర్ శ్యామల వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్‌కు నెటిజన్ రిక్వెస్ట్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సార్.. ఈ సెలబ్రిటీ, యాంకర్, సినిమా ఆర్టిస్టు, రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నది. చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్న ఆమెపై వెంటనే యాక్షన్ తీసుకోండి అంటూ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు.

More from Filmibeat

Read more about: anchor syamala pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X