జానీ మాస్టర్ కేసు సరే.. ఆ డైరెక్టర్, శ్రీరెడ్డి వివాదంలో మీరు ఎక్కడ? ఝాన్సీని ఏకిపారేస్తున్న నెటిజన్లు!

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం రేపిన జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై జానీ భాషపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసులో జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా కూడా ఉండి.. బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహరంలో తనపై విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో వేసిన కేసులో ఫిల్మ్ ఛాంబర్ విజయం సాధించింది. ఆ విషయంపై యాంకర్ ఝాన్సీ చేసిన పోస్టుపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. వారు ట్రోల్ చేసిన వివరాల్లోకి వెళితే..

వర్క్ ప్లేస్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడటంపై తీవ్రంగా స్పందించిన తెలుగు ఫిలిం ఛాంబర్‌పై జానీ భాషా కోర్టులో కేసు నమోదు చేశారు. నాపై ఆరోపణలు మాత్రమే వచ్చాయి. తీర్పు ఇంకా వెలువడలేదు కాబట్టి నాపై ఫిలిం ఛాంబర్ తీసుకొన్న నిర్ణయాన్ని తొసిపుచ్చాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే జానీ భాషా వేసిన పిటిషన్ జిల్లా కోర్టు తోసిపుచ్చింది. దాంతో కేసు గెలిచామంటూ యాంకర్ ఝాన్సీ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది.

Netizen Trolls on Anchor Jhansi over Instagram Post on Jani Master Case by Telugu Film Chamber

జానీ భాషా వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది. POSH గైడ్‌లైన్స్‌కు అండగా నిలుస్తూ సంస్థల్లో పనిచేసే మహిళ రక్షణకు ఇచ్చిన విశేషమైన తీర్పు ఇది. ఇలాంటి విషయాన్ని టేకప్ చేసిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ చర్యలను ప్రశంసించాలి. ఇలాంటి విషయాలను చట్టబద్దంగా ఎదుర్కొన్నాలి అని ఝాన్సీ తన పోస్టులో పేర్కొన్నారు.

Netizen Trolls on Anchor Jhansi over Instagram Post on Jani Master Case by Telugu Film Chamber

ఇండస్ట్రీలో కీచకంగా వ్యవహరించే వారిపై మీ లాంటి సీనియర్ యాక్టర్లు పోరాటం చేయడం హర్షనీయం. మహిళలను వేధించే వారు ఎంత శక్తిమంతులైనా సరే వారి నిజస్వరూపాలను బయటపెట్టే పనిని చేస్తున్నందుకు మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి తప్పుడు పనులు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి అని నెటిజన్ల కామెంట్ చేస్తున్నారు.

ఝాన్సీ పెట్టిన పోస్టుపై మిశ్రమ స్పందన లభిస్తున్నది. కొందరు ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఝాన్సీ తీరును, ఫిలిం ఛాంబర్ అనుసరిసున్న ద్వంద ప్రమాణాలను నిలదీస్తున్నారు. గతంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మీరంతా ఏం చేశారు. ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి ఇంకో న్యాయమా? ఇలాంటి తీరును ఎక్కడా చూడలేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Netizen Trolls on Anchor Jhansi over Instagram Post on Jani Master Case by Telugu Film Chamber

సినిమా పరిశ్రమలో కొందరు డైరెక్టర్లు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. మరి వాళ్ల మీద మీరు ఎందుకు ఫైట్ చేయడం లేదు. కేవలం జానీ మాస్టర్ మీదనే ఎందుకు? మీ పోరాటం అంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టారు. ఇలాంటి విషయాలపైన శ్రీరెడ్డి కూడా ఫైట్ చేసింది. అప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద తలకాయల పేర్లు బయటపెట్టింది. అప్పుడు మీరంత ఎక్కడ ఉన్నారు? అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. జానీ మాస్టర్ నేరం చేసినట్టు కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఆయనను దోషిగా ప్రకటించలేదు. అప్పడే మీరు అతడిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X