చిరంజీవి, పవన్ కల్యాణ్ నాకు సోదరులంటూ వంగా గీత.. ప్లేటు ఫిరాయించావా? పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్రోల్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హోరాహోరీగా జరిగాయి. టీడీపీ, జనసేన కూటమి, వైసీపీ పార్టీ మధ్య విమర్శలు, ఆరోపణలు వ్యక్తిగత దూషణలు ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు నోరుపారేసుకొన్నారు. అయితే తాజాగా వైసీపీ అభ్యర్థి వంగా గీత చేసిన కామెంట్లపై పవన్ కల్యాణ్ అభిమానులు దారుణంగా ఆడుకొంటున్నారు. ఆ ట్రోల్స్ వివరాల్లోకి వెళితే..

ఎన్నికల ముందు జరిగిన ప్రచారంలో పవన్ కల్యాణ్‌ను విధానపరంగా వంగా గీత విమర్శలు చేసింది. ఆయన సినీ నటుడు, సెలబ్రిటీ.. గెలిస్తే అందుబాటులో ఉండరు. నన్ను ఎన్నుకొంటే.. ప్రతీ ఒక్కరికి ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటాను. ఆయనకు ఒకవేళ అంతా పాపులారిటీ ఉంటే.. సినీ నటులు, టెలివిజన్ ఆర్టిస్టులతో ప్రచారం చేసుకొనే వారు కాదు అని విమర్శలు చేసింది.

Netizens are trolling heavily on Vanga Geeta over Chiranjeevi Pawan Kalyan are My Brothers

ఇక ఎన్నికల ప్రచారంలో చిట్టచివరి మీటింగ్‌లో వైఎస్ జగన్‌తో కలిసి వంగా గీత ప్రచారంలో పాల్గొన్నది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కారును మార్చినట్టు పెళ్లాలను మారుస్తుంటాడు. అలాంటి వ్యక్తికి ఓటు వేస్తారా? అని ఆమె పక్కన ఉండగానే వ్యక్తిగత విమర్శలు చేశారు. అలాగే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి నోటికి వచ్చినట్టు.. బూతులు తిట్టారు.

అయితే ఎన్నికల తర్వాత వంగా గీత స్వరం మారింది. ఓ మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవితోను ఆయన ఫ్యామిలీతో నాకు ప్రజారాజ్యం పార్టీ నుంచి మంచి అనుబంధం ఉంది. చిరంజీవి నాకు అన్నయ్యలాంటి వారు. ఆయనే కాకుండా నాగబాబు, పవన్ కల్యాణ్‌కు నాకు సోదరుల్లాంటి వారే. వారితో విధానపరమైన విభేదాలే ఉంటాయి. కానీ వ్యక్తిగత దూషణలు చేయలేదు. నా నియోజకవర్గంలో ఎవరూ కూడా చేయలేదు. ఎవరినీ చేయనీయలేదు అంటూ చెప్పింది.

దాంతో వంగా గీత పోలింగ్ తర్వాత ఫ్లేట్ ఫిరాయించింది. ఆమె మాటల్లో ఏదో తేడా కొడుతున్నది. ఫలితాలకు ముందే ఓటమిని ఒప్పుకొన్నారు అంటూ పవన్ కల్యాణ్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె కళ్లెదుటే వ్యక్తిగత దూషణలు చేస్తే ఖండించకుండా.. అబద్దాలు చెబుతున్నారనే విషయాన్ని మీమ్స్ రూపంలో, వీడియోల రూపంలో పోస్టు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై పోటీ చేసి చాలా రిస్క్ చేశాను. ఇన్నేళ్ల కెరీర్, పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోయింది అని తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల తర్వాత ఇలాంటి వార్తలు మీడియాలో కనిపించడం మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X