రామ్ చరణ్ బాలీవుడ్ మెగాస్టారా? అసిస్ క్రికెట్ బోర్డుపై నెటిజన్స్ ట్రోలింగ్

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్ తేజ్. డ్యాన్సులు, ఫైట్లు, నటనలో తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకోవడానికి ఆయనకు పెద్దగా టైం పట్టలేదు. మెగా కాంపౌండ్ నుంచి రావడంతో చరణ్ ఎంట్రీ నల్లేరుపై నడకలా సాగినా.. కెరీర్ తొలినాళ్లలో ఆయన నటన, లుక్స్ పరంగా ట్రోలింగ్ జరిగింది. అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో తట్టుకుని తన సినిమాలతో సమాధానం చెప్పారు చరణ్.

చిరుతతో నటనలో మంచి మార్కులు వేయించుకున్న ఆయనను ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర పూర్తిగా మార్చేసింది. 2009 జూలై 30న విడుదలైన మగధీర బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించి రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత రామ్ చరణ్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రచ్చ, నాయక్, ధ్రువలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టిన మెగా పవర్ స్టార్.. రంగస్థలంతో నటనలో రాటుదేలిపోయారు.

netizens fires on australia cricket board over they mistakenly said Ram Charan is a megastar of Bollywood

రీసెంట్‌గా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇందులో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఆయన అద్భుతంగా నటించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డ్ సైతం వచ్చింది. ఆ పాపులారిటీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయారు. కాగా. . ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఆస్ట్రేలియాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో వీరిద్దరూ పాల్గొంటున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను ' ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ ' అవార్డును చరణ్ అందుకున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీని ప్రదర్శించింది. ఈ కప్‌తో రామ్ చరణ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. వీటిని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అంతా బాగానే ఉంది కానీ.. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ పోస్ట్‌లో ఓ మిస్టేక్ చేసింది. రామ్‌చరణ్‌ను బాలీవుడ్ మెగాస్టార్‌గా పేర్కొంది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ , నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తని.. ఆయనను మెగా పవర్‌స్టార్ , లేదంటే గ్లోబల్ స్టార్ అని పిలుచుకుంటామని, పోస్ట్ చేసేటప్పుడు వివరాలు సరిగా తెలుసుకోవాలని చురకలంటిస్తున్నారు. ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X