రాము తాత అంటూ జక్కన్న ట్వీట్.. ముందు పని చూడంటూ ఆడేసుకుంటున్న ఫ్యాన్స్
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో చేస్తోన్న ఈ భారీ మల్టీ స్టారర్‌పై ఇప్పటికే అంచనాలు ఆకాశన్నంటాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్ రాగా.. అది చూసి షాక్ అయ్యారు సినీ ప్రేక్షకులు.

కొత్త డేట్‌ను ప్రకటించిన యూనిట్..
మొదటగా అనుకున్నట్టు ఆర్ఆర్ఆర్.. జూలై 30న విడుదల కావడం లేదు. షూటింగ్ ఆలస్యంగా జరుగుతుండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం ఇలా ఎన్నో కారణాలతో ఈ చిత్రం వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ అనేది వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు. జనవరి 8న 20121న విడుదల కానున్నట్లు ప్రకటించారు.

ఈ అప్‌డేట్‌పై ఫ్యాన్స్ ఫైర్..
ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఏదైనా అప్‌డేట్ ఇవ్వండంటూ.. పదే పదే ఫ్యాన్స్ అడుగుతుండటం, సోషల్ మీడియాలో కామెంట్ల వర్షాన్ని కురిపించడం లాంటివి చేసేవారు. వారు ఊహించని అప్‌డేట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది చిత్రయూనిట్. అప్‌డేట్ అడిగితే.. వాయిదా పడిందనే అప్‌డేట్ ఇచ్చారేంటి? నెటిజన్లు ఫైర్ అయ్యారు.
రాము తాత అంటూ ట్వీట్..
రాజమౌళి సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడు. ఏదో అలా అప్పుడప్పుడు ట్వీట్లేస్తుంటాడు. తనకు సంబంధించిన వారి చిత్రాల గురించి కామెంట్స్ పెడుతుంటాడు. ఆ మధ్య ఆయన చేసిన ట్వీట్స్.. సినిమా రిజల్ట్స్.. రెండూ వేర్వేరుగా ఉండటం చూసి జక్కన్నను నమ్మడమే మానేశారు. అది వేరే విషయమనుకోండి. తాజాగా రామ్ గోపాల్ వర్మ తాత అయ్యాడంటూ ఏదో మూడ్ వచ్చి ఓ ట్వీట్ పెట్టాడు. ఇక అంతే నెటిజన్స్ ఆడుకోవడం మొదలు పెట్టారు.
Recommended Video

ముందు అప్‌డేట్ ఇవ్వండి..
రాజమౌళి ట్వీట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే.. ఆర్ఆర్ఆర్ అప్‌డేట్ అనుకున్నామని, తీరా చూస్తే ఇదా? అని ఫైర్ అవుతున్నారు. మరికొందరు మీమ్స్ క్రియేట్ చేసి.. అప్‌డేట్ ఇవ్వండంటూ కౌంటర్ వేస్తున్నారు. ముందు ఆర్ఆర్ఆర్ పని చూడండి అనే ధోరణిలోనే అందరూ రియాక్ట్ అవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ బర్త్‌డేలకు ఫస్ట్ లుక్ వస్తుందని, ఆయన్ను ప్రశాంతంగా పని చేసుకోనివ్వండంటూ మిగతా వారిపై ఫైర్ అయ్యారు.


Click it and Unblock the Notifications











