Jawan for Oscar ఆస్కార్‌కు జవాన్ పంపుతాం.. అట్లీ కామెంట్స్‌పై భారీగా నెటిజన్ల ట్రోలింగ్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌తలో వచ్చిన జవాన్ చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా ఇప్పటికే సుమారు 900 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. ఇక 1000 కోట్ల రూపాయాలకు చేరువగా జవాన్ చిత్రం నిలిచింది. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియాకు చెందిన పలు ఛానెల్స్‌తో దర్శకుడు అట్లీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు. అట్లీ చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
జవాన్ సినిమా షూటింగ్ యూరప్‌లోని మారుమూల ప్రాంతంలో చేశాం. అయితే ఆ ప్రాంతంలో ఇండియా గురించి అక్కడి వారికి తెలియదు. అయితే ఇండియా పేరు చెప్పగానే షారుక్ ఖాన్ తెలుసు అన్నారు. అయితే మీకు తెలిసిన షారుక్‌తో జవాన్ అనే సినిమా చేస్తున్నాను. ఆ సినిమాకు నేనే డైరెక్టర్ అని గొప్పగా చెప్పుకొన్నాను అని అట్లీ తెలిపాడు.

జవాన్ తర్వాత షారుక్ ఖాన్, విజయ్ కలిసి సినిమా చేయాలని అనుకొంటున్నారు. వారిద్దరి కోసం నేను కథ రాస్తున్నాను. అయితే వారిద్దరూ కూడా మళ్లీ నా బర్త్ డే రోజు ఫోన్ చేసి స్క్రిప్టు చేస్తున్నావా అని అడిగారు. నా కోసం కథ రాస్తున్నావా అని పదే పదే అడిగారు. ఏదో ఒక రోజు వారిద్దరికి కథ చెబుతాను. ఆ కథ గురించి సీరియస్‌గా వర్క్ చేస్తున్నాను అని డైరెక్టర్ అట్లీ తెలిపారు.
అలాగే అల్లు అర్జున్‌తో నాకు స్నేహ బంధం ఉంది. మేమిద్దరం కలుస్తూనే ఉంటాం. మా ఇద్దరికి సినిమా అంటే ప్రాణం. అయితే మా మధ్య సినిమా చేయాలనే టాపిక్ వచ్చింది. మేము కొంత మేరకు చర్చించాం. దేవుడు దయ ఉంటే అల్లు అర్జున్‌తో కలిసి సినిమా చేయడం ఖాయం. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను అని అట్లీ అన్నాడు.
ఇక జవాన్ సినిమాను ఆస్కార్ పంపాలని ఆలోచిస్తున్నాను. ఈ విషయం షారుక్‌తో చర్చించాలని అనుకొంటున్నాను. ఇండియా ప్రైడ్‌ను ప్రపంచానికి చాటాలన్నదే నా ధ్యేయం. ఆస్కార్ బరిలో జవాన్ సినిమాను నిలిపేందుకు ట్రై చేస్తాం. ఇంకా ఈ విషయం గురించి నేను మాట్లాడలేదు అని తాజా ఇంటర్వ్యూలో అట్లీ చెప్పారు.

దాంతో ఆస్కార్‌కు జవాన్ పంపేందుకు ఆలోచిస్తామని అట్లీ చేసిన కామెంట్‌పై నెటిజన్లు గట్టిగా వేసుకొంటున్నారు. జవాన్ సినిమా పక్కా కమర్షియల్ సినిమా. అల్రెడీ అలాంటి సినిమాలు ఇండియన్ భాషల్లో చాలా వచ్చాయి. అలాంటి సినిమాల నుంచి కథ తీసుకొచ్చి జవాన్ మూవీ తీశావు. మళ్లీ ఈ సినిమాను ఆస్కార్ పంపి.. భారత్ పరువు తీయకు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











