‘వర్మ.. డబ్బు కోసం అమ్ముడుపోకు.. కక్కుర్తితో అంతలా దిగజారడమేంటి?’

బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.

ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ తేదీన మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నది.

ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ధోరణిలో ప్రీ రిలీజ్ రివ్యూ ఇచ్చి మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశాడు. ఇందు కోసం సుదీర్ఘమైన తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై నెటిజన్లు చాలా ఘాటుగా స్పందిస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. ఆర్జీవి చేసిన రివ్యూ ఏంటి? ఎందుకు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారనే వివరాల్లోకి వెళితే..

Ram Gopal Varma s Dhuradhar 2 Promotional Post

ధురంధర్ 2 సినిమా ఓ ఆస్టారాయిడ్. సినీ పరిశ్రమలో డైనోసార్ శకానికి ముగింపు పలుకుతుంది. దక్షిణాది సినీ రంగంలో కొనసాగుతున్న పాన్ ఇండియా చిత్రాల ఉద్యమాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతుంది. జెన్యూన్ క్యారెక్టర్ డెప్త్, అల్ట్రా రియలిస్టిక్ మేకింగ్‌తో సరికొత్త మైలురాయిగా మారబోతున్నది. ఆడియెన్స్ బ్రెయిన్‌ను ఎంగేజ్ చేయడమే కాకుండా ఊహించని ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకసారి ఇలాంటి కొత్త స్టాండర్డ్స్‌తో రూపొందే సినిమాలకు ఆడియెన్స్ అలవాటు పడితే.. మసాల దట్టించి సినిమాలు తీసే ప్రొడక్షన్స్ అన్నీ ప్రమాదంలో పడుతాయి అని వర్మ తన సుదీర్ఘమైన పోస్టులో వెల్లడించారు.

భారీ బడ్జెట్‌తో ఫార్మూలా సినిమాలు తీస్తూ నిర్మాతలు తమ జీవితాలను రిస్క్ చేస్తున్నారు. అలాంటి సినిమాలు తీసి రిలీజ్ చేస్తే థియేటర్లలో జనాలు కనిపించడం లేదు. ఆడియెన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు అలవాటు పడిపోతున్నారు. మాస్, వీఎఫ్ఎక్స్, ఊహకందని స్ట్రంట్స్‌తో సినిమాలు తీసే డైరెక్టర్లకు కాలం చెల్లింది. తమకు తాము దేవుళ్లుగా భావించే సూపర్ స్టార్స్ రియల్ క్యారెక్టర్ల ముందు తేలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధురంధర్ 2 సినిమా మార్చి 19వ తేదీన వస్తున్నది. మసాల ట్రీట్‌మెంట్, ఫేక్ హీరోయిజంతో వచ్చే సినిమాలను ఈ మూవీ ధ్వంసం చేస్తుంది అని వర్మ పేర్కొన్నారు.

అయితే వర్మ పోస్టుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తున్నది. కొందరు ఈ సినిమాపై ఆయన చేసిన పోస్ట్ గురించి సపోర్టుగా కామెంట్స్ చేస్తే..మరికొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. స్టాప్ నాన్సెన్స్. మిస్టర్ ఆర్జీవి.. నీ సినిమా గురించి నీవు హైప్ చేసుకొంటే.. ఆడియెన్స్ డైరెక్టర్‌గా రెస్పెక్ట్ చేస్తారు. నీకు ఉన్న ప్రతిష్టను పీఆర్ డబ్బు కోసం అమ్ముకోకు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ధురంధర్ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుందని తెలుసు. కానీ ఈ సినిమాకు నీవు పీఆర్‌గా మారకు. ఒకట్రెండు సార్లు అయితే ఓకే.. కానీ ప్రతీసారి ఈ సినిమా పీఆర్ టీమ్‌ సభ్యుడిగా కామెంట్ చేస్తే బాగుంటుందా? అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మసాలా, వీఎఫ్ఎక్స్, స్టంట్స్ బేస్డ్ సినిమాల శకం ముగియబోతుంది అంటూ ఇలా తన పోస్టుతో ఆర్జీవి భారీ చర్చకు తెరలేపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X