ఊర్వశీతో దబిడి దిబిడి.. అలాంటి శృంగార భంగిమలా? బాలయ్య, కొరియోగ్రాఫర్‌పై విమర్శల వెల్లువ
సినిమాలో డ్యాన్స్, పాటలు అనేది అత్యంత కీలకమైన భాగం. పాటలు చూడటానికి జనం పోటెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గతంలో మాదిరిగా పాటల్లో సాహిత్యం, అద్భుతమైన సంగీతం కనిపించడం లేదని సాంప్రదాయవాదులు , సినిమా ప్రేమికులు మండిపడుతున్నారు. కానీ మారుతున్న కాలానికి, యువత అభిరుచులకు తగ్గట్లుగా పాటలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
గతేడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలోని ఓ పాట వివాదాస్పద అయ్యింది. ఈ పాటలో రవితేజ - భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌లో ఇద్దరూ రెచ్చిపోయారు. ఇదే సమయంలో భాగ్యశ్రీ బోర్సే డ్రెస్‌కు వెనుక వైపు ఉన్న జేబులలో రవితేజ చేతులు దూర్చి వెరైటీ స్టెప్స్ వేస్తాడు. ఈ సాంగ్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఇదొక్కటే కాదు.. హీరో హీరోయిన్ల వయసు కూడా ఇక్కడ తీవ్ర చర్చనీయాంశమైంది. 56 ఏళ్ల రవితేజకి 25 ఏళ్ల భాగ్యశ్రీకి మధ్య ఇలాంటి స్టెప్స్, సీన్స్ పెడతారా అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ఇది పాకెట్ సాంగ్ పేరిట బాగా వైలర్ అవవ్వగా.. విమర్శలకు దర్శకుడు హరీష్ శంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
కట్ చేస్తే .. క్రియేటివ్ జీనియస్ సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 28 రోజుల్లోనే ఏకంగా రూ.1800 కోట్ల వసూళ్లు సాధించి భారతీయ చిత్ర పరిశ్రమలో కనివినీ ఎరుగని రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ముఖ్యంగా హిందీ నాట ఈ సినిమా వసూళ్ల దుమ్ము దులుపుతూ .. బాలీవుడ్‌కు చెమటలు పటిస్తోంది.
సినిమాకు ముందే ఆడియో బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీనిలోని పీలింగ్స్ సాంగ్‌లోని స్టెప్స్, కొన్ని సీన్లు మరీ వెగటుగా ఉన్నాయని ట్రోలింగ్ జరిగింది. ఈ పాటలో అల్లు అర్జున్.. హీరోయిన్ రష్మిక మందన్న నడుము లోపలి వరకు చేయి పెట్టి చేసే స్టెప్ మీద నెటిజన్లు మండిపడుతున్నారు. సుకుమార్ తన కెరీర్‌లోనే ఇలాంటి సాంగ్స్ కానీ, సీన్లు కానీ చేయలేదని తీయలేదని అంటున్నారు. తర్వాత కొద్దిరోజులకు ఈ వివాదం సద్దుమణిగింది.
తాజాగా నందమూరి బాలకృష్ణ - బాబీ దర్శకత్వంలో వస్తున్న డాకు మహారాజ్ నుంచి రీసెంట్‌గా దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో బాలయ్య, ఊర్వశిలు స్టెప్స్ వేస్తారు. అయితే హీరోయిన్ నడుముపై బాలయ్య దరువు వేయడంతో పాటు సేమ్ అల్లు అర్జున్ మాదిరిగానే నాభి భాగంలో చేయి వేసి ఊర్వశి డ్రెస్‌ను పట్టుకునే సీన్ ఉండటంతో నెటిజన్లు మరోసారి రెచ్చిపోతున్నారు. పనిలో పనిగా రవితేజ అభిమానులు ఇందులోకి దూరి.. బాలయ్య, అల్లు అర్జున్ జోలికి వెళ్లని జనాలు మా మాస్ మహారాజ్‌ను మాత్రం నానా మాటలు అంటారా అంటూ నిలదీస్తున్నారు. ప్రస్తుతానికి బాలయ్య సాంగ్ మాత్రం యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది.


Click it and Unblock the Notifications











