twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొణిదెల కోడలు అనిపించుకున్నావ్ అంటూ ప్రశంసలు.. మెగా కోడలికి నెటిజన్ల సపోర్ట్

    |

    Recommended Video

    Upasana Konidela Viral Tweet On PM Narendra Modi || ఉపాసన వాదన పై మీ OPINION ఏంటి ?

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా సామాజిక విషయాలపై స్పందిస్తుంటారు ఉపాసన కొణిదెల. అంతేకాకుండా ప్రజల ఆరోగ్యాని దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ చిట్కాలపై అందరకీ అవగాహన కల్గిస్తుంది. మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇంట్లోనే తయారుచేసుకునే పద్దతులను వివరిస్తూ ఉంటుంది.

    సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..

    సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..

    రామ్ చరణ్‌కు సంబంధించిన అప్డేట్స్, అపోలో హాస్పిటర్ వ్యవహారాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఎల్లప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా కూడా అలాంటి ఓ పోస్ట్ చేసి అందర్నీ ఆకర్శించింది. ఈ పోస్ట్‌తో మొత్తం దక్షిణ భారతదేశానికి ప్రతీకగా నిలిచింది.

    బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని చర్చ

    బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని చర్చ

    మహాత్ముని 150వ జయంతి వేడుకులు, ఆయన ఆశయాలు.. సమాజంపై సినిమా ప్రభావం.. సామాజిక బాధ్యత ఉన్న సినిమాల వల్ల కలిగే ప్రయోజనాలు, సంప్రదాయాలు, ఆచారాలు.. ఇలాంటి వాటిపై చర్చించేందుకు.. మార్పు మనలోనే మొదలవ్వాలి అనే కార్యక్రమాన్ని ప్రధాని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్టు కనిపిస్తోంది. మిగతా ఇండస్ట్రీ పెద్దలను ఆహ్వానించనట్టు తెలుస్తోంది.

    ప్రధానిని ఉద్దేశిస్తూ పోస్ట్..

    ప్రధానిని ఉద్దేశిస్తూ పోస్ట్..

    ఇదే విషయాన్ని ఉపాసన లేవనెత్తింది. సినిమా పరిశ్రమ అంటే కేవలం ఉత్తర భారతదేశం, బాలీవుడ్ మాత్రమే కాదంటూ ప్రధానికి విన్నవించింది. ఈ మేరకు ఓ పోస్ట్ ద్వారా తన ఆవేదనను ప్రధానికి చేరవేసేందుకు ప్రయత్నించింది.

    దక్షిణ భారతాన్ని పట్టించుకోలేదు..

    దక్షిణ భారతాన్ని పట్టించుకోలేదు..

    ప్రియమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, దక్షిణ భారతీయులమైన మేము.. మీ లాంటి వారు ప్రధానిగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము.. ఇంకా ఎంతో గర్వంగా ఉంది. ఈ సమావేశంలో కేవలంలో హిందీ పరిశ్రమకు సంబంధించిన వారినే ఆహ్వానించారు.. దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.. నా బాధను మీరు సరైన రీతిలో అర్థం చేసుకుంటానని భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో షారుఖ్, ఆమిర్, జాక్వెలిన్, కంగనా లాంటి వారు హాజరయ్యారు.

    నెటిజన్ల సపోర్ట్..

    నెటిజన్ల సపోర్ట్..


    ఉపాసన పెట్టిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు మద్దతు ప్రకటిస్తున్నారు. వీళ్లు మన గొప్పతనాన్ని గుర్తించకపోయినా పర్లేదు.. ఇదే సమయానికి మన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో వినబడుతోందంటూ లండన్‌లో జరగుతున్న బాహుబలి మ్యూజిక్ కాన్సర్ట్ గురించి ప్రస్తావిస్తున్నారు. కనీసం మీరైనా ప్రశ్నించినందుకు థ్యాంక్స్.. కొణిదెల కోడలు అనిపించుకున్నారు.. అంటూ నెటిజన్లు తమ కామెంట్లతో ఉపాసనకు మద్దతు తెలుపుతున్నారు. అయితే దిల్ రాజు, రకుల్ ప్రీత్ కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు కదా అని ఇంకొంత మంది ప్రశ్నిస్తారు. ఇక ఈ పోస్ట్ ప్రధాని ఆఫీస్ వరకు చేరి ఏదైనా సమాధానాన్ని తెస్తుందా అన్నది చూడాలి.

    English summary
    Narendra Modi Neglected South Film Industry. Uoasana Konidela Questioned On It. Netizens Supports To Her. THis Post Goes Viral In Social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X