Pawan Kalyan మీద దారుణమైన ట్రోల్స్.. ఆ విషయాల్లో లాజిక్ మిస్సయ్యారు.. దొరికేశారు అంటూ!

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ ఘనంగా వైభవంగా జరిగింది. అయితే ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.. పవన్ కళ్యాణ్ నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ మంత్రులను, ముఖ్యమంత్రిని అలాగే మీడియాని కూడా టార్గెట్ చేసి మాట్లాడడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఎదురు ట్రోల్స్ నడుస్తున్నాయి. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్న కొంతమంది ఆయన మాట్లాడిన మాటలను ట్రోల్ చేస్తున్నారు.. ఆ వివరాల్లోకి వెళితే

ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవర్ స్టార్

ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరైన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభంలోనే అసలు దిల్ రాజు తనతో వకీల్ సాబ్ సినిమా చేయకుండా ఉండి ఉంటే అసలు ఇంత రాద్ధాంతం జరిగేది కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.

వకీల్ సాబ్ సినిమాతో ప్రారంభమైన ఈ రగడ కారణంగా దాదాపు నలభై సినిమాలు ప్రస్తుతం ఆగిపోవాల్సి పరిస్థితుల్లో ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.. అసలు సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్మవలసి రావడం ఏమిటి అని ప్రశ్నించిన ఆయన దీని మీద వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తీసుకోవాలని అనుకుంటున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

నాని విషయంలో లాజిక్ మిస్

నాని విషయంలో లాజిక్ మిస్

అయితే నాని సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలకు లాజిక్ లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నాని టక్ జగదీష్ రిలీజ్ విషయంలో గొడవ జరిగింది తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్లు అలాగే థియేటర్ యజమానుల నుంచి.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ఎగ్జిబిటర్ అయిన సునీల్ నారంగ్ నిర్మించిన లవ్ స్టోరీ సినిమా విషయంలో ఆయన కోరితే వాళ్లు అందరూ నాని సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడారు అని. అయితే పవన్ కళ్యాణ్ అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలాగే వైఎస్ జగన్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారని కొందరు అంటున్నారు.

పవర్ లేని పవర్ స్టార్

పవర్ లేని పవర్ స్టార్

అలాగే నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో ఆయన అభిమానులు కొంతమంది పవర్ స్టార్ పవర్ స్టార్ అని నినాదాలు చేస్తుంటే పవర్ లేని కాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. దీంతో అదే పేరుతో హ్యాష్ టాగ్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు . అంతేకాక దిల్ రాజు విషయంలో కూడా ఆయన మీద ట్రోలింగ్ నడుస్తున్నాయి..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో దిల్ రాజు కూర్చుని కూర్చుని క్లాప్స్ కొట్టారని పవన్ మాట్లాడుతున్న అన్ని మాటలను ఆయన ఎంజాయ్ చేశారని, అలాంటప్పుడు సిగ్గు లజ్జ వదిలేసి గవర్నమెంట్ పిలిచిన మీటింగ్ ఎందుకు వెళ్లావు అని ఆయనని ప్రశ్నిస్తున్నారు.. అలాగే ముఖ్యమంత్రి, మంత్రి అనే కనీస గౌరవం ఇవ్వని వాళ్లతో మీటింగులు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు కొంతమంది..

బాలకృష్ణను ఎందుకు లాగారు?

బాలకృష్ణను ఎందుకు లాగారు?

అలాగే పవన్ కళ్యాణ్ మీటింగ్ లో బాలకృష్ణ కూడా ఇండైరెక్ట్గా సంబోధించారు. కొంతమంది మేం వేరు మేం దిగితే వేరేలా ఉంటుంది మా వంశాలు వేరు అంటూ మాట్లాడతారు కానీ ఇలాంటి సమయంలో ఎందుకు మాట్లాడటం లేదు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ విషయంలో బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఘాటుగానే పవన్ కళ్యాణ్ మీద స్పందిస్తున్నారు.

ఇక్కడ జరుగుతున్న విషయంలో బాలకృష్ణను లాగాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతేకాక ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద అని చెప్పుకుంటున్న చిరంజీవి స్వయంగా మాట్లాడ లేక పోగా బాలకృష్ణ ఎందుకు మాట్లాడాలని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాక స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు పవర్ లేదు అనడంతో దానిని పట్టుకుని ఇప్పుడు ట్రెండ్ సృష్టించే విధంగా నెటిజన్లు ముందుకు వెళుతున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 5, Episode 19 Highlights || Filmibeat Telugu
రాజకీయాలు తీయడం ఎందుకు?

రాజకీయాలు తీయడం ఎందుకు?

మరి కొంతమంది ఓ సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏమొస్తుంది? అంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. సినిమా ఫంక్షన్ అంటే సినిమా ఎలా ఉంటుంది? ఎందుకు ఈ సినిమా చూడాలి? ఎవరికోసం చూడాలి? ఈ సినిమా విశిష్టత ఏంటి? అనే విషయాలు ప్రస్తావిస్తే బాగుండేది అని అలాంటిది ప్రస్తావించడం మానేసి దాదాపు గంటసేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే ఉపయోగం ఏముంటుంది అని ప్రశ్నిస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం బాగోక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కారణంగా నిర్మాతలు మిమ్మల్ని పిలిస్తే వారికే నష్టం కలిగేలా మాట్లాడటం సబబు అని కొంతమంది అంటున్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా నోరు విప్పని తరుణంలో పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడారని దానికి అభినందించడం మానేసి ఇలా గోతులు తవ్వడం బాగా లేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X