Kalki 2898 AD కల్కి ట్రైలర్‌పై నెటిజన్ల ట్రోలింగ్: కమల్ హాసన్‌ లుక్‌పై దారుణంగా ర్యాగింగ్!

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ జూన్ 10న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ ను చూశాక కమల్ హాసన్ లుక్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. దానికి కారణం ఏంటి అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి 2898 ఏడీ ట్రైలర్ ఊహించినట్టుగానే కళ్ళు చెదిరిపోయేలా అద్భుతంగా ఉంది. భైరవగా ప్రభాస్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ లుక్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ లో మెయిన్ హైలెట్స్ అని చెప్పొచ్చు. పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే లాంటి దిగ్గజ నటీనటులు తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పడం మరో హైలెట్.

Netizens Trolled Kamal Haasan look from Kalki 2898 AD

ఇక ఈ మూవీలో కమల్ హాసన్ గుర్తుపట్టని రీతిలో, సరికొత్త లుక్ లో నటిస్తున్నాడన్న విషయాన్ని ట్రైలర్ ద్వారా మేకర్స్ రివీల్ చేశారు. ఆయన ట్రైలర్ లో కేవలం ఒకే ఒక డైలాగ్ చెప్పాడు. భయపడకు మరో ప్రపంచం వస్తుంది అంటూ ఆయన డైలాగ్ చెప్పగా, కేవలం సెకండ్ల వ్యవధిలోనే కమల్ హాసన్ ను చూపించారు.

బాగా గమనిస్తేనే గానీ ఆ డైలాగ్ చెప్పింది కమల్ హాసన్ అనే విషయాన్ని గుర్తుపట్టలేము. అయితే మెయిన్ హైలెట్స్ లో ఒకటైన కమల్ హాసన్ లుక్ పై ప్రస్తుతం ట్రోలింగ్ మొదలైంది. ఈ సినిమాలో కమల్ హాసన్ లుక్ ను భారతీయుడు 2 సినిమాలో లుక్ తో పోలుస్తున్నారు. అచ్చం ఆ సినిమాలోని లుక్ నే ఈ సినిమాలో దించినట్టుగా కనిపిస్తోంది అని కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా భారతీయుడు 2 సెట్స్ లో ఉన్న కమల్ హాసన్ ను మేకప్ తీయకుండానే ఈ సినిమా కోసం తీసుకొచ్చి షూట్ చేశారా ఏంటి ? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అయితే ఈ కామెంట్స్ అన్నీ చూస్తుంటే ఆ విషయం నిజమే అనిపిస్తుంది. భారతీయుడు 2లో ఉన్నట్టుగానే కమల్ లుక్ దాదాపుగా కల్కిలో కూడా ఉంది. మరి మేకర్స్ ఈ ట్రోల్స్ కి ఎలా సమాధానం చెప్తారో చూడాలి.

ఇక కల్కి ట్రైలర్లో ఉన్న లోటు ఇదొక్కటే కాదు మరో మైనస్ పాయింట్ ను కూడా కనిపెట్టారు నెటిజెన్లు. ముఖ్యంగా దీపిక పదుకొనే తెలుగు డబ్బింగ్ పై విపరీతంగా నెగెటివిటీ వస్తుంది. దయచేసి ఆమెతో ప్రయోగాలు చేయడం మానుకోండి అంటూ మేకర్స్ కు సజెషన్ ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీపికా పదుకొనే డబ్బింగ్ పై మీమ్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

Netizens Trolled Kamal Haasan look from Kalki 2898 AD

ఇక మొత్తంగా చూసుకుంటే ట్రైలర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్విని దత్ కల్కి 2898 ఏడీ మూవీని నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ జూలై 27న థియేటర్లలోకి రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X