పవన్, ఎన్టీఆర్‌ నీలాగే చేస్తున్నారా .. అల్లు అర్జున్‌ని ఏకిపారేస్తోన్న నెటిజన్లు

ప్రస్తుతం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన అరెస్ట్, విడుదల, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిస్ధితులు తెలుగు చిత్ర పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టడంతో పాటు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దిశలోకి నెట్టాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు తెలుగు సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు.

అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్ మొత్తానికి పాకడంతో పాటు త్వరలో రిలీజ్ కానున్న సినిమాలు ఇబ్బందుల్లో పడ్డాయి. సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణలో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆయన తీరు చూస్తుంటే ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు.

netizens trolling allu arjun over the promotion is icon star brand

ఇక ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ ప్రవర్తన కూడా తీవ్ర వివాదాస్పదమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు వద్దన్నా థియేటర్‌కు రావడం , తొక్కిసలాట జరిగి ఓ ప్రాణం పోయినా సినిమా చూశాకే బయటికి వెళ్తానని చెప్పడం ఆయనకు చెడ్డపేరు తీసుకొచ్చాయి. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత ఆయనకు కౌంటర్‌గా ప్రెస్‌మీట్ పెట్టడం.. దానికి లేట్‌గా రావడం, అందులో చెప్పిన మాటలు అబద్ధాలని తేలడం వ్యక్తిగతంగా అల్లు అర్జున్‌కు మాయని మచ్చగా పరిణమిస్తున్నాయి.

పోలీసులు తనను కలవలేదని, తాను సినిమా మొదలయ్యాక వెళ్లిపోయానని, తొక్కిసలాట జరిగి ఒకరు మరణించిన విషయం తెల్లవారే వరకు తనకు తెలియదని చెప్పిన మాటలన్నీ అబద్ధాలనీ తేలుస్తూ పోలీసులు, నెటిజన్లు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయడంతో అన్ని వైపుల నుంచి అల్లు అర్జున్ ఇరుక్కుపోయారు. అయితే ఇంత విషాదం జరిగినా పుష్ప 2 ప్రమోషన్స్ చేసుకునేలా టీషర్ట్స్ ధరించడం మరో వివాదానికి దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేయడం , దానికి అల్లు అర్జున్ హాజరు కావడం జరిగింది.

ఇక ఐకాన్‌ స్టార్ అంటూ అల్లు అర్జున్ వేసుకున్న టీ షర్ట్ రచ్చలేపుతోంది. చిత్ర సీమలో నటీనటులకు పేరుకు ముందు బిరుదు ఉంటుంది. నటరత్న, నటసామ్రాట్, నటశేఖర, నటభూషణ, నటకిరిటీ, నట సార్వభౌమ, యువరత్న, యువ సామ్రాట్, మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్‌స్టార్, యంగ్ టైగర్ వంటివి మన హీరోలకు ఉన్నాయి. అల్లు అర్జున్‌ను కూడా అభిమానులు తొలుత స్టైలీష్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునేవారు. అయితే అల వైకుంఠపురం, పుష్ప సినిమాల తర్వాతి నుంచి ఆయన ఇమేజ్ తారాస్థాయికి చేరడంతో ఫ్యాన్స్ ఐకాన్‌స్టార్‌గా పిలుచుకుంటున్నారు.

ఇంత విషాదం జరిగితే ఐకాన్ స్టార్ అనే తన బ్రాండ్‌ను అల్లు అర్జున్ ప్రమోట్ చేసుకుంటున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇండస్ట్రీలో మెగాస్టార్లు, పవర్‌స్టార్లు, సూపర్‌స్టార్లు , యంగ్ టైర్లు, మాస్ మహారాజ్‌లు ఉన్నారని కానీ ఎవరూ తమ బిరుదులను చొక్కాలపై ప్రింట్ వేసుకుని తిరగడం లేదని ఏకీపారేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ముఖ్యమని చురకలంటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X