హీరోయిన్‌‌‌ డ్రెస్ పైకి లేపి.. శేఖర్ మాస్టర్‌పై దారుణంగా ట్రోలింగ్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు . గ్రూప్ డ్యాన్సర్లలో ఒకడిగా కెరీర్ ప్రారంభించిన శేఖర్.. తన కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నారు. మాస్ మసాలా సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన స్టార్ హీరోలు, వారి ఇమేజ్‌ను పట్టి స్టెప్పులు కంపోజ్ చేస్తాడన్న పేరు తెచ్చుకున్నారు. ఎందరో స్టార్స్‌కి ఆయన ఫేవరేట్ కొరియోగ్రాఫర్. కానీ ఎందుకో ఈ మధ్య కాలంలో శేఖర్ మాస్టర్‌ కంపోజ్ చేసిన స్టెప్పులు వివాదాస్పదమవుతున్నాయి.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా వచ్చిన మిస్టర్ బచ్చన్‌లో అసలే హీరో హీరోయిన్ల వయసుపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. 56 ఏళ్ల రవితేజకి 25 ఏళ్ల అమ్మాయికి మధ్య ఇలాంటి స్టెప్స్, రొమాంటిక్ సీన్స్ పెడతారా అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. సరిగ్గా ఇదే సమయంలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి దానికి మరింత ఆజ్యం పోసింది. ఈ సినిమాలోని ఓ పాటలో హీరోయిన్‌ డ్రెస్‌కు వెనుక వైపు ఉన్న జేబులలో రవితేజ చేతులు దూర్చి పిరుదులపై దరువు వేస్తాడు. ఇలాంటి స్టెప్స్‌ను కంపోజ్ చేసినందుకు గాను శేఖర్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరగ్గా దర్శకుడు హరీశ్ శంకర్ అండగా నిలిచారు.

netizens trolling on choreographer sekhar master s adhi dha surprisu song dance with Ketika sharma

ఈ వివాదం సద్దుమణిగిందో లేదో ఆ వెంటనే మరోసారి విమర్శలకు గురయ్యారు శేఖర్. సుకుమార్- అల్లు అర్జున్‌ల బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2లోని పీలింగ్స్ సాంగ్‌లో స్టెప్స్ దారుణంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడ్డారు. ఈ పాటలో అల్లు అర్జున్.. రష్మిక నడుము లోపలి వరకు చేయి పెట్టి చేసే స్టెప్ వైరల్ అయ్యింది. అయితే సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించడంతో ఆ హోరులో ఈ వివాదాన్ని జనం పట్టించుకోలేదు.

Take a Poll

తర్వాత సంక్రాంతి కానుకగా బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్ వివాదం ఏకంగా బాలీవుడ్ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఊర్వశి రౌటేలా నడుము, పిరుదులపై బాలయ్య దరువు వేయడంతో పాటు నాబీ భాగంలో ఉన్న డ్రెస్‌ను పట్టుకుని సీన్ ఉండటంతో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి వివాదాస్పదమైంది. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు ఊర్వశి రౌటేలా స్వయంగా స్పందించి కౌంటర్లు వేయడంతో నెటిజన్లు సైలెంట్ అయ్యారు.

తాజాగా నితిన్ - శ్రీలీల జంటగా వస్తోన్న రాబిన్‌హుడ్‌ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు శేఖర్ మాస్టర్. ఇందులో హీరోయిన్ కేతికా శర్మ చేసిన అది ధా సర్‌ప్రైజు సాంగ్‌కు స్టెప్స్ కంపోజ్ చేశారు శేఖర్. ముఖ్యంగా కేతిక స్కర్ట్ పైకెత్తి చేసే స్టెప్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి స్టెప్స్‌ ఉంటే సినిమాను ఎలా చూడగలమంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే కేతిక మాత్రం తన గ్లామర్ షో, డ్యాన్సింగ్ టాలెంట్‌తో పాటను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. అయితే కాస్త స్లిమ్‌గా ఉంటే మాత్రం ఆమె డామినేషన్ వేరే రేంజ్‌లో ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ట్రోలింగ్‌పై శేఖర్ మాస్టర్, డైరెక్టర్ వెంకీ కుడుముల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X