Koratala Siva : నిద్ర బొక్క.. ఈసారి ఎవరు వేలు పెట్టాడమ్మా , కొరటాలపై పీక్స్‌లో ట్రోలింగ్

మూడున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్‌లో కూర్చోబెట్టడం అంత తెలికైన విషయం కాదు. కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఇట్టే కనెక్ట్ అవుతాయి. మరికొన్ని మాత్రం అందులో ఎన్ని ఎలిమెంట్స్ పెట్టినా వర్కవుట్ కావు. కానీ ఎవరో ఒకరిని బాధ్యుడిని చేసి ఫ్యాన్స్ తమ అక్కసు తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం బలయ్యేది మాత్రం నిర్మాత, దర్శకుడే. ఈ లిస్ట్‌లోనే చేరారు కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర రిలీజ్ నేపథ్యంలో ఆయన పేరు వార్తల్లో మారుమోగుతోంది.

గుంటూరు జిల్లాకు చెందిన కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టారు కొరటాల శివ. నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళీకి ఈయన వరుసకు మేనల్లుడు . తొలుత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసిన శివ తర్వాత పోసాని వద్ద అసిస్టెంట్‌గా చేరారు. మున్నా, బృందావనం, ఊసరవెల్లి, ఒక్కడున్నాడు వంటి సినిమాలకు రైటర్‌గా పనిచేశారు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నారు. ఈ వెంటనే మహేశ్ బాబుతో శ్రీమంతుడు, జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ , మరోసారి సూపర్‌స్టార్‌తోనే భరత్ అనే నేను సినిమాలు తీసి ఓటమి ఎరుగని దర్శకుడిగా నిలిచాడు.

netizens trolling on director koratala siva after watching devara movie here s the details

నాలుగు వరుస బ్లాక్ బస్టర్స్‌తో జోరు మీదున్న కొరటాలకు ఆచార్య సినిమా బ్రేకులు వేసింది. మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కిన ఆ సినిమా ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుని చిరంజీవి, కొరటాల కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ షాక్ నుంచి ఆచార్య క్యాస్ట్, మెగా అభిమానులు బయటకు రాలేకపోయారు. కొద్దిరోజులకి కొరటాలను టార్గెట్ చేశారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరిగింది.

అయితే కొరటాలను సపోర్ట్ చేసేవారు లేకపోలేదు. మెగా కాంపౌండ్ మితిమీరిన జోక్యం వల్లనే సినిమాకు అలాంటి రిజల్ట్ వచ్చిందని కామెంట్స్ పెట్టారు. కొద్దిరోజులకు ఈ ఇష్యూ సద్దుమణిగిపోయింది.. ఇటీవల ఓ కార్యక్రమంలో కొరటాల శివ మాట్లాడుతూ.. మన పని మనల్ని చేసుకోనిస్తే రిజల్ట్ వేరేలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఆయన పరోక్షంగా చిరంజీవిపై కామెంట్స్ చేశాడని మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. కట్ చేస్తే దేవర ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవిపై అభిమానం చాటుకున్నారు కొరటాల. తాను బౌన్స్ బ్యాక్ అవ్వాలని తొలుత కోరుకుందని మెగాస్టారే అని.. ఆయన తనకు మెసేజ్ పెట్టి ఆశీర్వదించారని తెలిపారు.

ఇదిలాఉండగా.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలకపాత్ర పోషించిన దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన కొందరు కొరటాలను మరోసారి రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈసారి ఎవరు వేలు పెట్టాడని చెప్పి తప్పించుకుంటావ్ అంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ పోస్ట్‌లు వైరల్ అవుతుండగా .. దీనికి కొరటాల శివ, దేవర యూనిట్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: chiranjeevi koratala siva jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X