మంచు లక్ష్మీపై భారీగా నెటిజన్ల ట్రోలింగ్.. రామ మందిర్ ప్రారంభోత్స సమయంలో అలా!
నటప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు గురించి ఆయన కుటుంబ సభ్యుల గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈయన గారాల పట్టి మంచు లక్ష్మీ ప్రసన్న గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె చేసినా, ఏం మాట్లాడిన తెగ ట్రెండ్ అవుతుంటుంది. ముఖ్యంగా ఆమె మాట్లాడే ఇంగ్లీష్ భాషకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఎక్కువగా ఆమె మాట్లాడే మాటలు ట్రెండింగ్ లోకి వస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం మంచక్క స్టైల్ మార్చింది. తనదైన స్టైల్ లో అయోధ్య రామయ్యకు పూజ చేసింది. అయితే మెచ్చుకోవాల్సిన అందరూ ఆమెపై విరుచుకు పడుతున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి 22వ తేదీన అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ చాలా గ్రాండ్ గా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దేశం మొత్తం ఆ క్షణాలను కళ్లారా వీక్షించేందుకు చాలా తపించారు. టీవీలు, ఫోన్లలో లైవ్ చూసుకుంటూ ఆ రామయ్యను దర్శించుకున్నారు. అయితే మంచు లక్ష్మీ కూడా అలాగే స్వామి వారిని దర్శించుకున్నారు. కేవలం దర్శించుకుని.. ఇంట్లోని రామయ్యకు పూజ చేసుకున్నారు. ఇంట్లో అంటే పూజ గదిలో అనుకుంటున్నారేమో.. అలా కాదు లెండి. అక్క మరింత స్టైల్ గా హాల్లోనే పూజ చేసింది.

ముందుగా అయోధ్య రామయ్య ముందు ఓ దీపం వెలిగించింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన ముందు కూర్చుని.. పూలను అక్షతలుగా మార్చి స్వామి వారిపై వేస్తూ పూజ చేసుకుంది. అయితే ఆమె అలా చేసింది ఏ ఫొటో ముందో కాదు. నేరుగా ల్యాప్ టాప్ లో రామయ్య వీడియో పెట్టి ల్యాప్ టాప్ కు పూజు చేసింది. దాని ముందే ఓ దీపం పెట్టి ల్యాప్ టాప్ పై పూలు చల్లుతూ స్పెషల్ పూజ చేసింది. చివర్లో జై శ్రీరామ్ అంటూ కూడా చెప్పుకొచ్చింది.
అయితే ఈ వీడియోను మంచు లక్ష్మీ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నెట్టింట పోస్ట్ చేసింది. అటు అన్ స్టాగ్రామ్ తో పాటు ఇటు ట్విట్టర్ లోనూ ఈ వీడియో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ముఖ్యంగా మంచు లక్ష్మీ చేసిన ఈ పూజ స్టైల్ కు అంతా ట్రోలింగ్ మొదలెట్టారు. ఇదెక్కడి ఏషాలు రా సామీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మంచు అక్క అంటే మామూలుగా ఉండదు, స్నో అక్క స్టైలే వేరే అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.
మరోసారి ఇలా పూజ చేయకు తల్లి అని, ఇంత భక్తి పూసను మేమెక్కడా చూడలేదంటూ మరికొంత మంది చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు అయితే కొబ్బరి కాయ కొట్టడం మరిచిపోయావు స్నో అక్కా అంటూ చెబుతున్నారు. మంచు ఫ్యామిలీ ఏం చేసిన ఇలాగే ఉంటుందని.. అందుకే ట్రోలింగ్ జరుగుతుందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవే.. ఇలాంటివే తగ్గించుకుంటే మంచిదని కూడా వివరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











