RCB విజయంతో అర్ధనగ్నంగా సెలబ్రిటీ బ్యూటీ.. నిజస్వరూపం చూపించాలని నెటిజన్ల డిమాండ్
దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లీ అయితే కప్ గెలిచిన ఆనందం తట్టుకోలేక మైదానంలో చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. భార్య అనుష్క శర్మ, ఇతర సహచరులు కోహ్లీని ఓదార్చారు. ఆ వెంటనే కప్ తీసుకుని గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అభిమానులను అలరించాడు కోహ్లీ. అటు ట్రోఫీ గెలిచి తొలిసారిగా బెంగళూరు వచ్చిన రాయల్ ఛాలెంజర్స్‌కు బెంగళూరులో ఘనస్వాగతం లభించింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ విజయోత్సవ సంబరాల్లో తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది వరకు గాయపడ్డారు.
మాట ప్రకారం అర్ధనగ్నంగా
రాయల్ ఛాలెంజర్స్ ఫైనల్ చేరడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెంగళూరు అభిమానులు తమ జట్టు గెలవాలని ఆకాంక్షించారు. అయితే ఎప్పుడు ఐపీఎల్ జరిగినా కొందరు హీరోయిన్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తుంటారు. ఫలానా జట్టు గెలిస్తే మేం అర్ధనగ్నంగా కనిపిస్తామని, అది విప్పేస్తాం, ఇది చేసేస్తామని సవాల్ విసురుతుంటారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ గెలిస్తే అర్ధనగ్నంగా కనిపిస్తానంటూ కేరళకు చెందిన అంకిత అనే ఓ సోషల్ మీడియా సెలబ్రెటీ ఛాలెంజ్ చేసింది. బెంగళూరు అభిమాని అయిన ఈ ముద్దుగుమ్మ .. తన ఫేవరెట్ జట్టు గెలవడంతో అన్నంత పని చేసింది. తన ఛాతి, నడుము భాగం కనిపించేలా బ్రాతో ఉండగా ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టింది అంకిత.

ఒరిజినల్ ఫోటో కావాలంటూ ట్రోలింగ్
ఈ ఫోటో క్షణాల్లో వైరల్ కాగా.. వివాదం కూడా రేగింది. ఇందులో ఉన్నది నువ్వు కాదని, ఇది డూప్లికేట్ ఫోటో అని, తమకు ఒరిజినల్ కావాలంటూ కోలీవుడ్ హీరో అజిత్ అభిమానులు, నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగడం సంచలనం సృష్టించింది. దీంతో అంకిత ఘాటుగా స్పందించింది. ఆర్సీబీ ఐపీఎల్‌లో విజయం సాధించడంతో ఇచ్చిన మాట ప్రకారం అర్ధనగ్నంగా కనిపించానని.. దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని అంకిత తెలిపింది. ఈ పోస్ట్‌ని ఎవరినో ఆకట్టుకోవడానికో, ఎవరి నుంచో ప్రశంసలు పొందడానికో ఉద్దేశించినది కాదని.. ఆర్సీబీ ఫైనల్‌లో గెలిస్తే ఏం చేస్తానని చెప్పానో అదే చేశానని ఘాటుగా చెప్పింది.
అజిత్ ఫ్యాన్స్ కక్ష సాధిస్తున్నారు
కానీ గతంలో అజిత్ అభిమానులతో ఉన్న వివాదం కారణంగా వారు నా గురించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నారని అంకిత ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఫోటో నాది కాదని, అది ఫేక్ ఐడీ అంటూ ట్రోల్ చేస్తున్నారని.. ఇందుకోసం గూగుల్ లెన్స్ వంటి సాంకేతికతను వాడుతున్నారని అంకిత మండిపడింది. ఆ ఫోటో తనదేనని, నేనే పోస్ట్ చేశానని స్పష్టం చేసింది. వాళ్ల (అజిత్ అభిమానులు) లక్ష్యం నా మీద ప్రతీకారం తీర్చుకోవడమే. నేను గతంలో వారి మోసాలకు బలయ్యాను, కానీ ఈసారి అలా జరగదని అంకిత స్పష్టం చేసింది. ఈ వ్యక్తులు అభిమానులు కాదు.. అబద్థాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆధారాలు బయటపెడతా
దయచేసి నకిలీ స్క్రీన్‌షాట్‌లు, వక్రీకరించిన కథనాలతో ఆన్‌లైన్‌లో ఇతరులను రెచ్చగొట్టొద్దని అంకిత విజ్ఞప్తి చేసింది. వారి మాయలకు, మోసాలకు తనలా ఎవ్వరూ బలైపోవద్దని తాను జోక్యం చేసుకుంటున్నానని అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించింది. చూసే ప్రతిదానిని నమ్మొద్దని, ముఖ్యంగా వ్యక్తిగత ద్వేషంతో ఫ్యాన్స్ ముసుగులో గ్యాంగ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్న అజిత్ అభిమానులారా? మీరు ఇలాగే ముందుకు సాగండి.. నేను నా ఆధారాలను బయటపెడతానని అంకిత వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











