సూపర్‌మ్యాన్ ముద్దు పెట్టుకొంటే తప్పా? 33 సెకన్ల లిప్‌లాక్‌ కట్.. సెన్సార్‌పై ఆగ్రహం

DC కామిక్స్ నుంచి వచ్చిన అద్బుతమైన అమెరికన్ సూపర్ హీరో క్యారెక్టర్ సూపర్ మ్యాన్. డీసీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. సూపర్ మ్యాన్ సిరీస్‌లో ఇది రెండో రీబూట్ చిత్రం. సూపర్ మ్యాన్‌గా డేవిడ్ కోరెన్‌స్వెట్ నటించాడు. ఈ చిత్రంలో రాచెల్ బ్రోస్నన్, నికోలాస్ హాల్ట్, ఇడీ గాథేజీ, ఆంథోని కారిగన్, నాథన్ ఫిల్లియాన్, ఐసాబెల్లా మెర్సిడ్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు హెన్రీ బ్రాహమ్ సినిమాటోగ్రఫి, విలియమ్ హాయ్, క్రెయిగ్ అల్పర్ట్ ఎడిటింగ్, జాన్ మర్పీ, డేవిడ్ ఫ్లేమింగ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా అమెరికాతోపాటు పలు దేశాల్లో జూలై 11వ తేదీన రిలీజైంది. అయితే ఈ సినిమాలోని ఘాటు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు కత్తెర వేయడంపై నెటిజన్లు, సినీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ కామెంట్స్ వివరాల్లోకి వెళితే..

Spiderman Movie

హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ రూపొందించిన ఈ సినిమాకు భారతీయ భాషల్లో డబ్ అయిన వెర్షన్‌పై సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కఠినంగానే వ్యవహరించింది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలేషియా, కన్నడ భాషలకు సంబంధించిన వెర్షన్లకు యూ/ఏ (U/A) 13+ రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమాలోని 33 సెకన్ల నిడివి ఉండే గాఢమైన ముద్దు సీన్ నిర్ధాక్షిణంగా కట్ చేశారు.

అయితే ఈ మూవీలోని లిప్ లాక్ సీన్‌ను కట్ చేయడంపై తెలుగు, హిందీలో నటి శ్రేయా ధన్వంతరీ మండిపడింది. ఈ సినిమాలోని ముద్దు సీన్‌ను కట్ చేశారనే విషయం నాకు తెలిసింది. ఇదే నిజమైతే దానంత చెత్త పని ఏమీ ఉండదు. ప్రతీ రోజు ఏదో చెత్త విషయాలు జరుగుతూనే ఉంటాయి. ఇదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి విషయాలు సినిమా రంగంలో చోటు చేసుకొన్నప్పుడు స్పందించాలనిపిస్తుంద అని ఆమె అన్నారు.

సూపర్‌మ్యాన్ సినిమా విషయంలో సెన్సార్ అవలంభించిన విధానాన్ని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంస్కార వంతమైన సెన్సార్ బోర్డును సూపర్ మ్యాన్ కూడా ఓడించలేడు అని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. అది ఒట్టి కిస్.. వాళ్లిద్దరు ఒకరి బట్టలు మరొకరు తొలగించలేదు కదా అని మరో నెటిజన్ సెటైర్ వేశాడు. మిడిల్ ఫింగర్‌ను చూపించడం కూడా లేపేశారని తెలిసింది. అంతకంటే జోక్ ఇంకా ఏముంటుంది? హౌస్‌ఫుల్ సినిమాలో సన్నివేశాల చూస్తే.. F1 సినిమా గురించి పెద్దగా పట్టించుకోవద్దని అనిపిస్తుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇండియన్ స్క్రీన్లపై లోయిస్ లేన్‌ ఆర్టిస్టును సూపర్‌మ్యాన్ ముద్దు పెట్టుకోవడంపై సెన్సార్ సభ్యులు అభ్యంతరం పెట్టి దానిని తొలగించారట. కానీ ఇండియన్ సినిమాల్లో మాత్రం ఒకరిపై ఒకరు పడుకోవడం, హీరోయిన్‌ను హీరో తడమడం, హీరోయిన్‌ వెంటపడి వేధించడం, మహిళా ఆర్టిస్టును కొట్టడం లాంటివి చేయడం లాంటి విషయాలకు అభ్యంతరం లేదా? ఇండియన్ సెన్సార్ బోర్డు అసలు నిబంధనలు పాటిస్తున్నాదా? అంటూ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

More from Filmibeat

Read more about: cbfc spiderman james gunn
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X