Devara: 1500 పెడితే 100 దేవరలు చూడొచ్చు.. నాగవంశీ నోటి దురదపై దారుణంగా ట్రోలింగ్!

సితారా ఎంటర్‌టైన్‌మెంట్, హారిక హాసిని బ్యానర్లపై భారీ చిత్రాలు, ఫీల్‌గుడ్ సినిమాలు అందించే నిర్మాత నాగవంశీ అప్పుడప్పుడు మీడియా ముందు ట్రిప్ అవుతుంటాడు. తాజాగా దేవర సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి భారీ లాభాలను సాధించిన ఈ యువ నిర్మాత ఈనెల చివరిలో లక్కీ భాస్కర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనదైన శైలిలో డైలాగ్స్ పేల్చారు. అయితే నెటిజన్లు మాత్రం ఆయన చేసిన కామెంట్స్‌పై విరుగబడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ జంటగా లక్కీ భాస్కర్ సినిమాను అక్టోబర్ 30వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమా గురించిన ప్రమోషన్స్‌లో ఆ మూవీ ప్రచారం కంటే.. అనసవసరమైన విషయాలే ఎక్కువ మాట్లాడినట్టు కనిపించింది. మీడియాలో తడుముకోకుండా మాట్లాడే ఆయన కొన్నిసార్లు చేసిన కామెంట్లకు దారుణమైన ట్రోలింగ్ గురవుతుంటాడు.

Netizens Trolls Naga Vamshi comments over NTR s Devara Ticket Prices in his Lucky Bhasker Movie promotions

తాజాగా దేవర సినిమా టికెట్ల గురించి ఆయన మాట్లాడుతూ.. సింగిల్ థియేటర్‌లో టికెట్ ధర 250 రూపాయలు, కుటుంబంలో నలుగురు సభ్యులు సినిమాకు వెళితే.. నాలుగు టికెట్లకు 1000 రూపాయలు. ఇక పాప్ కార్న్, ఇతర తినుబండారాలకు 500 వందలు. మొత్తం 1500 ఖర్చు అవుతుంది. ఇంతకంటే తక్కువ డబ్బుతో 3 గంటల వినోదాన్ని ఎవరైనా ఆస్వాదిస్తారా? అంటూ తన వేదాంతాన్ని బయటపెట్టారు.

అయితే మధ్య తరగతికి 1500 రూపాయలు అనేది ఎక్కువే. దానిని అంత ఈజీగా తీసుకొంటారా? ఆయనను నెటిజన్లు ట్రోల్ చేస్తారు. బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన ఆయనే ఇలా చులకనగా మాట్లాడితే.. ఎలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన మాట్లాడిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.

అయితే 1500 రూపాయలకు 3 గంటల వినోదం ఇంతకంటే ఎక్కడైనా వస్తుందా? అని చేసిన కామెంట్‌పై ో నెటిజన్ స్పందిస్తూ.. 1500 పెట్టి ఓటీటీ సబ్ స్క్రైబ్ చేసుకొంటే దేవర లాంటి రోటీన్ రెగ్యులర్ సినిమాలు మరో 100 చూడొచ్చు. మీలాంటి వాళ్లు అతిగా వాగుతున్నందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదు అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు. ఇంకా దారుణంగా ఆయనపై కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్ పక్కన పెడితే.. దేవర కలెక్షన్ల గురించే మాట్లాడటం, ఆడియెన్స్‌ను కించపరిచేలా కామెంట్స్ చేయడంపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఎప్పుడూ ఫన్నీగా సమాధానాలు ఇచ్చే నాగవంశీ 1500 రూపాయలకు 3 గంటల వినోదంపై గట్టిగానే ప్రతికూలతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.

More from Filmibeat

Read more about: naga vamshi devara lucky bhasker
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X