ఏంటి బాలయ్య.. అంజలితో అలా దురుసుగా..నెటిజన్ల ట్రోల్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. భారీ అంచనాలతో మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మే 28వ తేదీన సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ అంజలితో బాలకృష్ణ బిహేవ్ చేసిన విధానం వివాదాస్పదమైంది. ఈ వివరాల్లోకి వెళితే..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రోమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు నందమూరి బాలకృష్ణ రావడంతో రెట్టింపు హుషారు కనిపించింది. ఎన్నికల కారణంగా షూటింగులు, ఈవెంట్లకు దూరంగా ఉండటంతో అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. అయితే ఇటీవల సత్యభామ, ఈ మూవీ ఫంక్షన్లకు బాలయ్య రావడంతో ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా కనిపించారు. ఈవెంట్‌లో జై బాలయ్యఅంటూ నినాదాలు చేయడంతో ఆయనలో కూడా ఆనందం రెట్టింపు అయింది.
అయితే వేడుక జరుగుతున్న సమయంలో బాలకృష్ణ పక్కనే ఓ బాటిల్‌లో అనుమానాస్పదంగా మద్యం మిక్స్ చేసినట్టు లిక్విడ్ కనిపించింది.అయితే అది మెన్షన్ హౌస్ మందు కలిపిన వాటర్ అంటూ నెటిజన్లు పోస్టులతో హోరెత్తించారు. అయితే చిత్ర యూనిట్ వివరణ ఇస్తూ.. అది ఎనర్జీ డ్రింక్ అని చెప్పడంతో నెటిజన్లు కన్విన్స్ కాలేకపోయారు.
ఇక స్టేజ్‌పై బాలయ్య హుషారుగా కనిపించారు. నేహాశెట్టి,అంజలి,విశ్వక్ సేన్, నాగవంశీతో కలిసి ఫోటో దిగేందుకు తోసిద్దమయ్యారు. అయితే నేహా శెట్టికి అంజలి అడ్డుగా రావడంతో.. పక్కకు జరుగు అంటూ ఆమెను సరదాగా తోసేశారు. అయితే అది చూసే వారికి కొంత ఇబ్బందికరంగా అనిపించింది. అయితే అలా తోయడాన్ని అంజలి కూడా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
అయితే ఈ సీన్‌పై నెటిజన్లు, కొందరు సీనియర్ జర్నలిస్టులు అభ్యంతరం చెబుతూ ట్రోల్ చేశారు. ఎమ్మెల్యేగా, కార్పోరేట్ హాస్పిటల్ చైర్మన్‌గా, స్టార్ హీరోగా ఉండే ఆ విధంగా ప్రవర్తించడం సరికాదు. బాధ్యతాయుతంగా స్టేజ్ మీద ఉండాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











